కరుణించు మంగమ్మతల్లీ
బుట్టాయగూడెం: కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా పేరు పొందిన గుబ్బల మంగమ్మతల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక అలంకరణతో ఉన్న మంగమ్మవారిని దర్శించుకున్న భక్తులు పరమానంద భరితులయ్యారు. ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 5 వేల వరకు భక్తులు తరలివచ్చి దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రంలో ఆదివారం సైతం భక్తుల రద్దీ కొనసాగింది. సెలవు దినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి తరలివచ్చారు. దాంతో దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు, కల్యాణకట్ట, నిత్యాన్నదాన భవనం, ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, పరిసర ప్రాంతాలు భక్తులతో పోటెత్తాయి. అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది.
కై కలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మా.. నీ పాద చరణములే గతి అంటూ భక్తులు అమ్మను ఆర్తితో వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మను సమీప జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళా భక్తులు పాలపొంగళ్లు సమర్పించారు. అనేక కుటుంబాలు వేడి నైవేద్యాలతో మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం రోజున ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాల అమ్మకం, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.50,605 ఆదాయం వచ్చిందని చెప్పారు.
ఆకివీడు: మండలంలోని ఐ.భీమవరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన మోసాది మోహన్ రావు, బుల్లి శ్రీరాములు కాళ్ళ మండలం కాళ్ళకూరు గ్రామంలో చేపల చెరువుపై పనిచేస్తున్నారు. శనివారం ఆకివీడు వస్తుండగా ఐ.భీమవరం వద్ద ప్రమాదం జరిగింది. మోహన్ రావు అక్కడక్కడ మృతిచెందగా శ్రీరాములు గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కరుణించు మంగమ్మతల్లీ
కరుణించు మంగమ్మతల్లీ


