బాడీ బిల్డింగ్ పోటీలు
భీమవరం: భీమవరం త్రీ టౌన్‌లోని కె.12 జిమ్‌లో ఆదివారం న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిస్టర్ భీమవరం బాడీ బిల్డింగ్ – ఫిజిక్ మోడలింగ్ పోటీలు నిర్వహించారు. న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఖాసిం ఈ పోటీలు ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా మానవతా సంస్థ అధ్యక్షుడు చింతలపాటి రామకృష్ణంరాజు, కో చైర్మన్ కారుమూరి నరసింహమూర్తి పాల్గొన్నారు. విజేతలకు జ్ఞాపికలు అందజేశారు.
తణుకు అర్బన్: తణుకు మండలం తేతలి జాతీయ రహదారిపై లారీ అదుపుతప్పి పంటకాలువలో పడిన ఘటనలో లారీ డ్రైవర్ మృతిచెందాడు. తణుకు రూరల్ ఎస్సై కె.చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. తాడేపల్లిగూడెం నుంచి తణుకు వైపు ధాన్యం లోడుతో వస్తున్న లారీ తేతలి వద్దకు వచ్చాక అదుపుతప్పి సమీపంలో ఉన్న కాలువలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో తణుకు కొమ్మాయిచెర్వు గట్టు ప్రాంతంలో నివసిస్తున్న లారీ డ్రైవర్ వట్టిపులుసు సూరిబాబు(43) మృతిచెందాడు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే తణుకు రూరల్ ఎస్సై కె.చంద్రశేఖర్ తమ సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.
బాడీ బిల్డింగ్ పోటీలు


