కేంద్ర ప్రత్యేక న్యాయస్థానం పీపీగా విద్యాశంకర్
విశాఖ లీగల్: నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది విద్యాశంకర్ ఖండవల్ కేంద్ర వ్యవస్థీకృత నేరాల ప్రత్యేక న్యాయస్థానం(స్పెషల్ కోర్టు ఫర్ ఆర్గనైజ్డ్ క్రైమ్) పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ రాజీవ్ లోచన్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రముఖ న్యాయవాది కందాల శ్రీనివాసరావు కార్యాలయంలో గతంలో ఆయన జూనియర్‌గా పనిచేశారు. విద్యాశంకర్ ఈ పదవి లో మూడేళ్లపాటు కొనసాగుతారు. ఆయన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఉభయగోదావరి జిల్లా లు, కాకినాడ జిల్లాల పరిధిలోని అన్ని ఈడీ కోర్టులకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సేవలందిస్తా రు. 2004లో నగరంలోని ఎన్‌బీఎం లా కళాశాలలో అభ్యసించారు. న్యాయవాదుల పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు ద్రోణంరాజు అశ్వినికుమార్, సీనియర్ న్యాయవాదులు అయ్యల సోమయాజుల శివతేజ, కందాల సుబ్రహ్మణ్యం, సోమేశ్వరరావు, విశా ఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్, రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్ సహా పలువురు సీనియర్ న్యాయవాదులు ఆయనకు అభినందనలు తెలిపారు.


