4 నుంచి ప్రకృతి పంటల మేళా
మద్దిలపాలెం: ఏయూలోని ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు ప్రకృతి ఆధారిత పంటల మేళా నిర్వహిస్తున్నట్లు భారతీయ కిసాన్ సంఘం జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి పిలుపునిచ్చారు. మిద్దె తోటల ప్రకృతి రైతుల వనమాలి, సీటీజీ గ్రూప్‌ల నిర్వాహకులు అరవల అరుణ, మళ్ల సరిత, నాదెళ్ల జ్యోతిల నేతృత్వంలో శివాజీపాలెంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మేళా వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గో ఆధారిత ప్రకృతి పంటల 6వ మేళాను నగర ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, ప్రకృతి రైతు రిషీ, గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జె.వి.రత్నం, పలువురు రైతులు పాల్గొన్నారు.


