
● అలరించిన బకాసుర వధ
శ్రీకాళహస్తీశ్వర అనుబంధ ద్రౌపదీ సమేత ధర్మరాజ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న తిరునాళ్లలో భాగంగా మూడో రోజు ఆదివారం బకాసుర వధ ఘట్టాన్ని వైభవంగా నిర్వహించారు. భీముడి వేషధారి ఎద్దుల బండిలో వీధుల్లో తిరుగుతూ భిక్షాటన చేసి అన్నం సేకరించి ధర్మరాజ స్వామి ఆలయం వద్దకు చేరుకున్నాడు. అనంతరం బకాసుర వధ ఘట్టం ప్రదర్శించారు. ఈ క్రమంలో పట్టణంలో సేకరించిన అన్న ప్రసాదం పంచిపెట్టారు. ఈ సందర్భంగా ధర్మరాజు, భీముడు, అర్జున వేషధారులు ఆలయం వద్ద కనువిందు చేశారు. అనంతరం అర్జునుడు మత్స్య యంత్ర ఛేదన ఘట్టం ప్రదర్శించారు. – శ్రీకాళహస్తి

● అలరించిన బకాసుర వధ