
ఎప్పటికీ చెవిరెడ్డి వెంటే..
కూటమి ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసి రెడ్‌బుక్ పేరుతో కక్షసాధింపులకు పాల్పడుతోంది. ఎన్ని కేసులు పెట్టినా చెవిరెడ్డి ఎవరూ ఏం చేయలేరు. నిత్యం దైవ చింతనలో ఉండే చెవిరెడ్డి తిరుమల శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉంటాయి.
– ఎస్.మునీర్, ఏఎంసీ మాజీ చైర్మన్, పాకాల
ఎదుర్కోలేకే..
చెవిరెడ్డి చేసిన సేవలు ప్రజల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోతాయి. ఆయనను నేరుగా ఎదుర్కొనే దమ్ములేకనే అధికారం అడ్డు పెట్టుకుని అక్రమంగా అరెస్టు చేయించారు. కూటమి నేతలకు చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. – గుంగ్లూరి సురేష్,
మండల యువజన విభాగం అధ్యక్షుడు, పాకాల
దేవుడు చూస్తున్నాడు
కూటమి నేతల దాడులు, దౌర్జన్యాలను దేవుడు చూస్తున్నాడు. అన్యాయంగా చెవిరెడ్డిని అరెస్ట్ చేసిన పాపం ఊరికే పోదు. ప్రజా కంటకులను త్వరలోనే తరిమికొట్టే రోజులు వస్తాయి. కర్మ ఫలితం అనుభవించేందుకు కూటమి నేతలు సిద్ధంగా ఉండాలి. – పి.హసీనా,
ఎంపీటీసీ మాజీ సభ్యులు, పాకాల
●

ఎప్పటికీ చెవిరెడ్డి వెంటే..

ఎప్పటికీ చెవిరెడ్డి వెంటే..