
పిల్లలను చదువుకు దూరం చేయొద్దు
చిట్టమూరు : మండల పరిధిలోని ఈశ్వరవాక పంచాయతీ కోతలగుంట గ్రామస్తులు తమ పిల్లలను చదువుకు దూరం చేయొద్దని మంగళవారం పాఠశాల వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల్లోని 3,4,5 తరగతుల విద్యార్థులను మోడల్ స్కూల్‌కు వెళ్లి చదువుకోవాలని చెబుతున్నారని, అక్కడికి 7 కిలోమీటర్ల దూరం ఉందన్నారు. ఈ మార్గంలో బస్సు సౌకర్యంగాని, ఆటోలు కూడా రావని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నట్టుండి గ్రామంలోని బడి మార్పు చేస్తే తమ పిల్లలు చదువుకు దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.