
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘రోజుకో పొలిటికల్ టూరిస్టు ఢిల్లీ నుంచి వస్తరు. నోటికి వచ్చింది వాగుతరు. హమ్‌నే ఏ దియా.. ఓ దియా అంటరు. లక్ష కోట్లని ఒకరు, నాలుగు లక్షల కోట్లు ఇచి్చనట్లు మరొకరు చెబుతరు. గత ఎనిమిదేళ్లలో పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ అక్షరాలా రూ.3,65,797 కోట్లు ఇచి్చంది. కానీ, కేంద్రం రాష్ట్రానికి తిరిగి ఇచ్చింది రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే. ఇదంతా ఎవరి సొమ్ము? మా సొమ్ము తింటూ తెలంగాణపై విమర్శలు చేస్తరా’అంటూ రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు బీజేపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
శనివారం ఖమ్మం పర్యటనకు వచి్చన కేటీఆర్ నగర పరిధిలో సుమారు రూ.100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారం¿ోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధ్యక్షతన ఇక్కడి సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన పట్టణ ప్రగతి బహిరంగసభలో కేటీఆర్ మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం అన్ని రాష్ట్రాల మాదిరిగానే మన రాష్ట్రానికి నిధులు రావాల్సి ఉన్నా కేంద్రం ఇవ్వడం లేదన్నారు. ‘మతపిచ్చితో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను మసీదులు తవ్వ డానికా ప్రజలు ఎంపీగా ఎన్నుకున్నది’ అని ప్రశ్నించారు.
‘సంజయ్, మోదీ ప్రభుత్వానికి దమ్ముంటే బీడు భూములకు నీళ్లు పారించేలా కొత్త కాల్వలు, పేదలకు ఇళ్లు కట్టడానికి పునాదులు తవ్వేందుకు ముందుకు రావాలి’అంటూ సవాల్ విసిరారు. ‘నిన్న దేశం అంతటా 25 కోట్ల మంది ముస్లిం సోదరులు ఎక్కడికక్కడ నిరసనలు తెలిపారు. ఎందుకు ఈ రోజు దేశంలో ఇట్లాంటి విపరీత ధోరణులు కనపడుతున్నాయి. పచ్చగా ఉండే ఈ దేశంలో పంచాయతీలు పెడుతూ చిల్లరమల్లర రాజకీయాలు చేస్తున్న బీజేపీనే ఇందుకు కారణం’అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
వరంగల్ వచి్చన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తమకు ఒక్క చాన్స్ ఇవ్వాలని చిలకపలుకులు పలికారని, తెలంగాణ ప్రజలు పది చాన్స్‌లు ఇచ్చినా 50 ఏళ్ల పాలనలో ఏం వెలగబెట్టారని ఎద్దేవా చేశారు. ‘రెడ్లకు పగ్గాలు ఇస్తేనే, రెడ్లు ఓట్లు వేస్తేనే అధికారంలోకి వస్తాం’.. అని కుల పిచ్చితో రేవంత్‌రెడ్డి బాహాటంగా మాట్లాడుతున్నారని అన్నారు. ‘కులం పిచ్చోళ్లు కావాలా? కులం మతం ప్రాతిపదికన కాకుండా అందరివాడైన కేసీఆర్ నాయకత్వం కావాలా?’అని సభికులను ఉద్దేశించి అడిగారు.
ఖమ్మం జిల్లాకు అన్యాయంపై కాంగ్రెస్ నేతలు ప్రశ్నించలేదేం?
పెద్ద నాయకులమని ఫోజులు కొడుతున్న కాంగ్రెస్ నేతలు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు జరిగిన అన్యాయంపై ఎనిమిదేళ్లలో ఎప్పుడైనా గొంతువిప్పారా.. అని మంత్రి కేటీఆర్‌ప్రశ్నించారు. ఏడు మండలాలను పక్క రాష్ట్రంలో కలిపినా, సీలేరు విద్యుత్ తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు.
అన్నా.. మీరట్లే కంటిన్యూ అవండి..
‘సైకిల్ వేసుకుని గల్లీ గల్లీ తిరుగుతున్నడు. కల్యాణలక్షి్మ, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు లబ్ధిదారుల ఇళ్ల వద్దే ఇస్తున్నడు. అజయ్ అన్నా.. మీరట్లే కంటిన్యూ అవండి’అంటూ కేటీఆర్ సభావేదిక నుంచి మంత్రి పువ్వాడ పనితీరును అభినందించారు. మంచి పనులు చేస్తూ ఎర్రజెండాకు కూడా పనిలేకుండా చేస్తుంటే కొందరు కుళ్లుబోతుతనంతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
వాళ్లు సత్యహరిశ్చంద్రుని బంధువులా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో ఉన్న వాళ్లందరూ సత్యహరిశ్చంద్రుని బంధు వులేనా..? అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శనివా రం ఉదయం ఆయన ‘జస్ట్ ఆస్కింగ్’ హ్యాష్ ట్యాగ్‌తో ఈ మేరకు ట్విట్టర్‌లో తన వ్యాఖ్యను పోస్ట్ చేశారు. ఎనిమి దేళ్లలో ఇప్పటి వరకు ఎందరు బీజేపీ నేతలు లేదా వారి సన్నిహితులు, బం ధువులపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఐటీ, సీబీఐ దాడులు జరిగాయని ప్రశ్నించారు.
కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు
రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో తాను పర్యటించినా ఖమ్మం మాదిరి అభివృద్ధి ఎక్కడా చూడలేదని కేటీఆర్ తెలిపారు. సిరిసిల్ల, గజ్వేల్, మెదక్ కన్నా ఖమ్మం మెరుగైన స్థానంలో ఉందన్నారు. రెండో ఆలోచన, అభిప్రాయం లేకుండా ఈరోజు రాష్ట్రంలో నంబర్‌వన్ కార్పొరేషన్ ఏదంటే కచి్చతంగా ఖమ్మం అని చెప్పక తప్పదన్నారు. లకారం చెరువుపై అందమైన తీగల వంతెన, వాకింగ్ ట్రాక్, ఫౌంటేన్లతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండగా... మున్నేరు నిండైన నీటి అందాలు, ఎన్నెస్పీ జలకళ, పచ్చదనాన్ని హెలీకాప్టర్ నుంచి మంత్రి పువ్వాడ చూపించారని చెప్పారు.
‘మున్నేరు కళకళలాడుతుండడంతో భూగర్భ జలాలు పైకి వస్తున్నాయి... అందుకే కేసీఆర్‌లో కే అంటే కాల్వలు, సీ అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు అని రాష్ట్రవ్యాప్తంగా రైతులు చెప్పుకుంటున్నారు’ అని కేటీఆర్ వెల్లడించారు. వంద గజాలల్లోపు ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉండే పేదలకు జీఓ 58 ద్వారా రెగ్యులరైజ్ చేస్తున్నామని పేర్కొన్న కేటీఆర్.... దళారులకు తావివ్వకుండా కలెక్టర్ స్వయంగా దరఖాస్తులను పరిశీలించి లబి్ధదారులను గుర్తించాలని సూచించారు. ప్రక్రియ పూర్తికాగానే సీఎం కేసీఆర్‌ను ఖమ్మం తీసుకొచ్చి ఆయన చేతుల మీదుగా పేద వారికి ఇళ్ల పట్టాలు ఇప్పిద్దామని తెలిపారు. ‘ప్రజలు మనల్ని కొత్త రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు, ఇళ్లు అడుగుతారు. వాటిని మనమే ఇద్దాం.’ అని కేటీఆర్ చెప్పారు.