
పరువు హత్య, ఆత్మహత్యలు, అత్యాచార ఉదంతాలపై.. తెలంగాణ గవర్నర్ సీరియస్ అయ్యారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల జరిగిన ఆత్మహత్యలు, పరువు హత్య, అత్యాచార ఘటనలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఘటనలపై రిపోర్ట్‌లు ఇవ్వాలని గురువారం ఆమె అధికారులు ఆదేశించారు.
ఖమ్మంలో సాయిగణేష్, కామారెడ్డిలో తల్లీకొడుకులు ఆత్మహత్యలపై మీడియా, సోషల్ మీడియా రిపోర్టులను పరిశీలించిన గవర్నర్ తమిళిసై.. ఈ అంశాలపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరారు.
అంతకు ముందు మెడికల్ పీజీ సీట్ల బ్లాక్ దందాపై గవర్నర్ ఆరా తీశారు. రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసిన గవర్నర్ తమిళిసై.. విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని, నివేదిక ఇవ్వాలని వీసీని ఆదేశించినట్లు తెలుస్తోంది.