సమగ్రత, సామరస్యంతో సాగుదాం | - | Sakshi
Sakshi News home page

సమగ్రత, సామరస్యంతో సాగుదాం

Apr 13 2026 8:02 AM | Updated on Apr 13 2026 8:02 AM

సమగ్రత, సామరస్యంతో సాగుదాం ఫైబర్‌ పడవలు దగ్ధం

కొరుక్కుపేట: ఐక్యత, సమగ్రత, సామరస్యంతో ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని వక్తలు అన్నారు. యూనైటెడ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ (యూఈఎఫ్‌) ఆధ్వర్యంలో చైన్నె, రాయపేటలోని అమీర్‌ మహల్‌ వేదికగా యూఈఎఫ్‌ ఈద్‌ మిలాన్‌– 2026ను విజయవంతంగా జరిగింది. కార్యక్రమానికి ప్రముఖ నాయకులు, పారిశ్రామికవేత్తలు, నిపుణులు హాజరయ్యారు. ఆర్కాట్‌ నవాబ్జాదా ఆసీఫ్‌ అలీ నేతృత్వంలో సాగిన ఈ వేడుకల్లో యూఈఎఫ్‌ ప్రెసిడెంట్‌ అహ్మద్‌ బుహారి, విష్ణుమోహన్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు స్వామి శ్రీహరిప్రసాద్‌, రెవరెండ్‌ ఫాదర్‌ సుందర్‌రాజ్‌ పాల్గొన్నారు.

తిరువొత్తియూరు: మామల్లపురం సమీపం కొక్కిలమేడు మత్స్యకార ప్రాంతం వద్ద సముద్రతీరంలో ఉపయోగించని రెండు పైబర్‌ పడవలు నిలిపి వున్నాయి. ఈ పడవలకు దగ్గరగా చెత్తకుప్పలు పేరుకుపోయింది. ఈ పరిస్థితిలో ఈ చెల్కు అకస్మాతుగా మంటలు అంటుకుంది. దీనిపై సమాచారం మేరకు మామల్లపురం అగ్నిమాపక కేంద్రం అధికారి ఇన్బరాజ్‌ నేతృత్వంలో ఐదు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి అరగంటకు పైగా శ్రమించి మంటలను ఆర్పివేశారు. పడవలు తగలబడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement