క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Apr 12 2026 3:06 AM | Updated on Apr 12 2026 3:06 AM

● న్యాయవాదికి 10 ఏళ్ల జైలు శిక్ష

డిమాండ్లు నెరవేర్చకుంటే ఎన్నికలు బరిష్కరిస్తాం

కొరుక్కుపేట: చెంగల్పట్టు జిల్లాలోని కల్పాక్కం సమీపంలో పుదుపట్టినం చేపల వేట ప్రాంతం, వయలూర్‌ ఉయలికుప్పం చేపల వేట ప్రాంతం, ఒక దాని కొకటి ఆనుకుని ఉన్నాయి. ఏ జాలర్లు ఏ చేపల వేట ప్రాంతానికి చెందిన వారు అనే సమస్య తలెత్తుతోంది. రెండు గ్రామాల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా ఫిబ్రవరి 15న మయానా ఉత్సవాన్ని నిలిపి వేశారు. ఈ ఘటనలో ఇరువైపులా వున్న మత్స్యకారులను అరెస్టు చేయగా, మరిన్ని అరెస్టు భయంతో వారు గత రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఈ పరిస్థితిలో అరెస్టు అయిన మత్స్యకారులను ఇప్పుడు బెయిల్‌పై విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో తమ పరిధి ఎంత వరకు విస్తరించి ఉందో లెక్కించి ఒక నేమ్‌ప్లేట్‌ను ఏర్పాటు చేయాలని మత్స్యకారులు అధికారులను కోరారు. ఈ విషయాన్ని నొక్కి చెపుతూ ఈ సమస్యకు తక్షణ పరిష్కారం కనుగొనాలని శనివారం ఉదయం పుదుపట్టినం మత్స్యకారులు శనివారం చేపల వేటకు సముద్రంలోకి వెళ్లలేదు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామని మత్స్యకారులు ప్రకటించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది.

పెళ్లి పేరిట అత్యాచారం కేసులో..

అన్నానగర్‌: విల్లుపురం జిల్లాలోని పెరియశేవల్‌కు చెందిన లాయర్‌ శివ రాజ్‌ (33) ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2016లో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయమై ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉలుందూరుపేట మహిళా పోలీసులు శివరాజ్‌ను అరెస్టు చేశారు. ఈ కేసును శుక్రవారం విచారించిన విల్లుపురం మహిళా కోర్టు న్యాయమూర్తి వినోద, శివరాజ్‌కు 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటూ రూ. 25,000 జరిమానా విధించారు. బాధితురాలికు రూ. 2 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం శివరాజ్‌ను కడలూరు సెంట్రల్‌ జైలుకు తరలించారు.

సహకార బ్యాంకులో

రూ. 71 లక్షలు గోల్‌మాల్‌

కొరుక్కుపేట: కల్లకురిచ్చి జిల్లా, చిన్నసాలెంలో పనిచేస్తున్న విల్లుపురం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు శాఖలో అవకతవకలు జరిగాయని వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు ఆడిట్‌ నిర్వహించారు. 37 డిపాజిట్‌ రసీదుల ద్వారా బ్యాంకు నుండి రూ. 71,19,654 బదిలీ అయినట్లు గుర్తి్‌ంచారు. తప్పిదాలకు పాల్పడిన అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ శరవణన్‌తో సహా నలుగురిపై మోసంతో సహా 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. శరవణన్‌ను శనివారం అరెస్టు చేశారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

కల్తీ మద్యం విక్రయించిన

10 మందికి జరిమానా

తిరువొత్తియూరు: పుదుచ్చేరిలో శాసనసభ ఎన్నికలు గురువారం ముగిశాయి. ఓట్ల లెక్కింపు వచ్చే నెల మే 4న జరుగుతుంది. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి ఎన్నికల శాఖ వివిధ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గత 7వ తేదీ నుండి గురువారం వరకు 3 రోజులు పుదుచ్చేరి రాష్ట్రంలోని అన్ని మద్యం, సారా దుకాణాలు మూసివేయబడ్డాయి. దీని ప్రకారం పుదుచ్చేరిలోని 443 మద్యం దుకాణాలు, 83 మద్యం సారా దుకాణాలు, 37 గోదాములు మూసివేయబడ్డాయి. అదేవిధంగా కారైకాల్‌, మాహే, యానాం ప్రాంతాల్లోని మద్యం దుకాణాలు, సారా దుకాణాలు కూడా మూసివేశారు. అదే సమయంలో పుదుచ్చేరిలో గత 3 రోజుల్లో కల్తీ మద్యం విక్రయించిన 10 మందికి ఎకై ్సజ్‌ శాఖ పోలీసులు రూ.45 వేల జరిమానా విధించారు. వారి నుంచి 114 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 3 రోజుల తర్వాత శుక్రవారం పుదుచ్చేరిలో మళ్లీ మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. అక్కడ మద్యం ప్రియులు పెద్దఎత్తున మద్యం కొనుగోలు చేసి తీసుకెళ్లడం కనిపించింది.

ఆకట్టుకుంటున్న

వైల్డ్‌ మిలాన్‌ ప్రదర్శన

సాక్షి, చైన్నె: చైన్నె రాయపేటలోని ది ఫాలీ అమెథిస్ట్‌లో ‘సమ్మర్‌ సోయిరీ ఎడిట్‌’ పేరుతో ఏర్పాటు అయిన వైల్డ్‌ మిలాన్‌ ప్రదర్శన అమితంగా ఆకట్టుకుంటుంది.మహిళా పారిశ్రామికవేత్తలు, స్వదేశీ బ్రాండ్‌లను ప్రోత్సహించడానికి సిరి చందనా రెడ్డి స్థాపించి, నిర్వహిస్తున్న వైల్డ్‌ మిలన్‌ ఎగ్జిబిషనన్స్‌ గత నాలుగు సంవత్సరాలుగా అందరి మన్ననలు అందుకుంటుంది చిన్న , వర్ధమాన వ్యాపారాలకు, ముఖ్యంగా మహిళల నేతృత్వంలోని సంస్థలకు గుర్తింపు , వృద్ధి అవకాశాలను అందించాలనే దార్శనికతతో ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చైన్నె రాయపేటలోని ది ఫాలీ అమెథిస్ట్‌లో ‘‘సమ్మర్‌ సోయిరీ ఎడిట్‌’’ పేరుతో ఏర్పాటు చేసిన వైల్డ్‌ మిలాన్‌ ప్రదర్శనను ప్రముఖ కళాకారులు అశ్విని విశ్వనాథన్‌, ప్రముఖులు సిరి చందనా రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement