సాక్షి, చైన్నె : సిటీ యూనియన్ బ్యాంక్, ఐపీఎల్ దిగ్గజం చైన్నె సూపర్ కింగ్స్ మధ్య భాగస్వామ్యాన్ని వేడుకగా జరుపుకుంటూ అధికారిక గీతం ఆవిష్కరించారు. పట్టుదల, జట్టు కృషి , అభిరుచి వంటి ఉమ్మడి విలువలను ప్రతిబింబించేలా ఈ గీతాన్ని రూపొందించారు. ఈ గీతం బ్యాంక్ కస్టమర్లను క్రికెట్ అభిమానులను ఏకం చేసేలా తీర్చిదిద్దారు. అలాగే ఈ సహకారం ద్వారా సీఎస్‌కే నమ్మకమైన క్రెడిట్ కార్డ్ పార్ట్‌నర్‌గా సీయూబీ తన పాత్రను చాటుకునే విధంగా చర్యలు తీసుకున్నారు.అ న్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ గీతాన్ని ప్రమోట్ చేయనున్నారు. అభిమానులు కూడా ఈ గీతంపై తమ సొంత వెర్షన్లను షేర్ చేయాలని బ్యాంక్ పిలుపు నిచ్చింది. గురువారం సాయంత్రం చైన్నెలో జరిగిన ఈ గీతాన్ని, క్రెడిట్ కార్డును సినీ నటుడు శివ ఆవిష్కరించారు. ఆయనతో పాటుగా సీయూబీ, సీఎస్‌కే జట్టు ప్రతినిధులు పాల్గొన్నారు.


