రమణను గెలిపిస్తే మంత్రిని చేస్తాం
తిరువళ్లూరు: తిరువళ్లూరు నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థి రమణను ఆదరిస్తే, మంత్రిగా చేసి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మాజీ మంత్రి వైగై సెల్వం అన్నారు. తిరువళ్లూరులోని వేర్వేరు ప్రాంతాల్లో అన్నాడీఎంకే తిరువళ్లూరు అభ్యర్థి రమణకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. రమణ మాట్లాడుతూ రమణను ఆదరిస్తే మంత్రిని చేస్తామని అన్నారు. ఐదేళ్ల డీఎంకే హయాంలో నిరుపేదలకు పావలా పంచి రెండింతలు నిత్యావసర వస్తువుల ధరలను పెంచారని వాపోయారు. అన్నాడీఎంకేను విమర్శించే స్తాయి అర్హత ఉధయనిధి, కనిమెళికి లేదన్నారు. పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడ్లబండిపై టీవీకే అభ్యర్థి ప్రచారం
తిరువళ్లూరు: నియోజకవర్గంలోని ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు, నర్సులతోపాటు మందుల కొరత లేకుండా పనిచేస్తానని టీవీకే అభ్యర్థి డాక్టర్ అరుణ్‌కుమార్ హామీ ఇచ్చారు. తిరువళ్లూరు నియోజకవర్గంలోని వేర్వేరు ప్రాంతాల్లో టీవీకే అభ్యర్థి డాక్టర్ అరుణ్‌కుమార్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పెట్రోల్, డీజిల్, గ్యా స్ ధరల పెరుగుదలకు నిరసనగా గ్రామాలకు ఎడ్లబండిలో వెళ్లి ప్రచారం నిర్వహించారు. అరుణ్‌కుమార్ మాట్లాడుతూ పట్టణంలో ఆర్ట్స్ కళాశాల ఏర్పాటు, ప్రభుత్వ వైద్యశాలలో మందు లు, డాక్టర్‌లు, నర్సుల కొరత లేకుండా చూడ డంతో పాటు అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తామన్నారు. నియోజకవర్గంలో అర్హత వున్న పాఠశాలలను గుర్తించి అప్‌గ్రేడ్ చేస్తామని, ప్రతి యూనియన్‌లోనూ ఫుల్‌టైమ్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. పార్టీ నేతలు ఎండీ. మణి, ఆనంద్‌రాజ్, వెంకటేషన్, సుందర్ పాల్గొన్నారు. అదేవిధంగా పూండి యూనియన్‌లోని తిరుప్పాచ్చూర్, శిరువానూర్, కై వండూరు, కొశవన్‌పాళ్యం, పట్రపెరంబదూరుతోపాటు పలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
వన్ ప్లస్ నుంచి నార్డ్ 6 ఆవిష్కరణ
సాక్షి, చైన్నె : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ తన నార్డ్ సిరీస్‌లో అత్యంత శక్తివంతమైన మోడల్‌గా వన్ ప్లస్ నార్డ్ 6 గురువారం స్థానికంగా ఆవిష్కరించింది. యువత, గేమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, అత్యాధునిక ఏఐ ఫీచర్లు , తిరుగులేని బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్‌ను రూపొందించారు. ఈ ఫోన్‌లో ప్రధానంగా 9 వేలు ఎంఏహెచ్ ఎస్‌ఐ కార్బన్ బ్యాటరీని పొందుపరిచారు. అద్భుతమైన కెమెరా ఫీచర్లతో వన్‌ప్లస్ నార్డ్ 6 క్విక్ సిల్వర్, ఫ్రెష్ మింట్, పిచ్ బ్లాక్ రంగులలో విడుదల చేశారు.
టీవీకే అభ్యర్థి బంధువు
ఇంటిపై ఐటీ దాడులు
కొరుక్కుపేట: తమిళనాడులో శాసనసభ ఎన్నికలు 23వ తేదీన జరగనున్నాయి. తమిళగ వెట్రి కళగం పార్టీ తరఫున జిల్లా కార్యదర్శి రాజ్‌కుమార్ కడలూరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన భార్య, సరళాదేవి సోదరుడు అయిన పుగళేంది ఇల్లు కడలూరు ఎస్‌ఎన్ చావడి మెట్టు వీధిలో ఉంది. అతను ఆదాయం కంటే ఎక్కువ డబ్బును అతని ఇంట్లో దాచిపెడుతున్నారని ఆదాయపు పన్ను శాఖకు ఫిర్యాదు అందింది. అదేవిధంగా, ఎన్నికల సమయంలో ఓటర్లకు పంచడానికి డబ్బును దాచిపెడుతున్నారని ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్‌కు రహస్య సమాచారం అందింది. బుధవారం రాత్రి సుమారు 7 గంటలకు, కడలూరు రెవెన్యూ కమిషనర్ శరవణన్, ఆదాయపు పన్ను శాఖ డిప్యూటీ డైరెక్టర్ , ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల బృందం నేతృత్వంలోని ఒక బృందం పుగళేంది ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత, వారు తలుపుకు తాళం వేసి ఇల్లంతా సోదా చేశారు. ఇంటిలోని ప్రతి అంగుళాన్ని వారు వెతికారు. అదేవిధంగా, ఆదాయపు పన్ను శాఖ అధికారులు కడలూరు బస్టాండ్ వద్ద ఉన్న పుగళేందికి చెందిన కన్వీనియన్‌ర్ స్టోర్‌లో కూడా సోదా చేశారు. ఈ సోదా రాత్రి 12.30 గంటలు దాటిన తర్వాత కూడా కొనసాగింది. ఈ పరిస్థితిలో, ఆదాయపు పన్ను అధికారులు గురువారం రెండో రోజు కూడా పుగళేంది ఇంటిపై సోదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
చోరీ కేసులో ఐదుగురి అరెస్టు
తిరువొత్తియూరు: చైన్నె, మనలి, బలరాం వీధి కి చెందిన జయచిత్ర (39). ఈమె ఇంటి వెను కవైపు తాళం పగలగొట్టి లోపలికి చొరబడిన దుండగులు ఇంట్లో ఉన్న వంటగ్యాస్ సిలిండ ర్లు, మోటార్ చోరీ చేశారు. దీనిపై జయచిత్ర, ఆర్.కే నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కొరుక్కుపేట మీనాంబళ్ నగర్‌కు చెందిన షణ్ముగం (22), స్టీఫెన్ అలియాస్ వెంకటేశన్ (19) రాయపురం గ్రేస్ గార్డెన్ ప్రాంతానికి చెందిన జగన్ (19) అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇంకా, ఈ దొంగతనంలో సంబంధం ఉన్న 16 సంవత్సరాల వయస్సు కలిగిన ఇద్దరు మైనర్లను కూడా పట్టుకుని విచారణ జరిపారు. వారి నుండి మోటార్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేయబడిన షణ్ముగం, స్టీఫెన్, జగన్ అనే ముగ్గురిని బుధవారం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. ఇద్దరు మైనర్ల ను జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు.


