కాంగ్రెస్‌కు షాక్‌ | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు షాక్‌

Apr 10 2026 9:57 AM | Updated on Apr 10 2026 9:57 AM

● సీటు దక్కలేదని కొత్త పార్టీ ● మేలూరులో కీలక నేతల నిర్ణయం

సాక్షి, చైన్నె : అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి గట్టి గా షాక్‌ ఇచ్చే రీతిలో మదురై జిల్లా మేలూరుకు చెంది న కాంగ్రెస్‌ నేతలు నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌ మానవ హక్కుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మహాత్మా శ్రీనివాసన్‌ పార్టీకి రాజీనామా చేసి, కొత్త రాజకీయ పార్టీని గురువారం ప్రకటించారు. డీఎంకే కూటమిలో మేలూరు నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీకి కేటాయించారు. ఈ స్థానం నుండి పోటీ చేసేందుకు శ్రీనివాసన్‌ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, కాంగ్రెస్‌ అధిష్టా నం ఆయనను కాదని కాంచీపురంకు చెందిన మాజీ ఎంపీ విశ్వనాథన్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన శ్రీనివాసన్‌, తొలుత తి రుగుబాటు అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. కానీ, పార్టీ నుండి అధికారిక పత్రాలు (బి–ఫామ్‌) లేకపోవడంతో ఆయన నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి న శ్రీనివాసన్‌’ మతతత్వ వ్యతిరేక సోషలిస్ట్‌ కాంగ్రెస్‌’(ఎంఎస్‌ కాంగ్రెస్‌) అనే పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు. గురువారం జరిగిన కార్యక్రమంలో పార్టీ జెండాను, గుర్తును ఆయన ఆవిష్కరించారు.

మాణిక్యం ఠాగూర్‌పై విమర్శలు

కొత్త పార్టీని ప్రకటించిన అనంతరం శ్రీనివాసన్‌ విలేకరులతో మాట్లాడుతూ ఎంపీ మాణిక్యం ఠాగూర్‌పై విమర్శలు గుప్పించారు: మేలూరు నియోజకవర్గానికి కనీసం దరఖాస్తు కూడా చేసుకోని బయటి వ్యక్తికి మాణిక్యం ఠాగూర్‌ టికెట్‌ ఇప్పించారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఓడిపోవడం ఖాయమని, మాణిక్యం ఠాగూర్‌ కూడా అదే కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ను ఓడించడం ద్వారా సీనియర్‌ నేత పి. చిదంబరంను ఇబ్బంది పెట్టాలని, తద్వారా వచ్చే ఎన్నికల్లో తమిళ వెట్రి కళగం పార్టీతో కూటమి కట్టాలనేది మాణిక్యం ఠాగూర్‌ వ్యూహం అని శ్రీనివాసన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అన్నాడీఎంకేకు మద్దతు

ప్రస్తుత ఎన్నికల్లో తాము అన్నాడీఎంకే అభ్యర్థి పెరియపుల్లాన్‌ కు మద్దతు ఇస్తున్నట్లు శ్రీనివాసన్‌ ప్రకటించారు. మేలూరులో కాంగ్రెస్‌ ఓట్లను చీల్చడం ద్వారా అన్నాడీఎంకే విజయానికి సహకరిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement