కొరుక్కుపేట: రాష్ట్రంలో ఈ నెల 23వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులలో ఓటు హక్కుపై అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమం శ్రీ కన్యకాపరమేశ్వరి మహిళా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగింది. విద్యార్థులలో ఓటు హక్కు, ప్రాముఖ్యతను తెలియచేయడానికి వినూత్నమైన, ఆసక్తికరమైన ఫేస్ పెయింటింగ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. బుధవారం విద్యార్థినులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని ప్రతి ఓటు విలువైనదే మీ ఓటు మీ గళం బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండండి వంటి బలమైన సందేశాలను తెలియచేస్తూ తమ ముఖాలపై సృజనాత్మకమైన డిజైన్లను, నినాదాలను చిత్రించుకుని ఆకట్టుకున్నారు. ఎన్నికలలో చురుకై న భాగస్వా మ్యాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వనజ తెలిపారు.


