సాక్షి, చైన్నె: వేగంగా హిమోగ్లోబిన్ స్క్రీనింగ్ నిర్వహించి, గరిష్ట సంఖ్యలో కౌమార దశలోని బాలికలకు రక్తహీనత పరీక్షలు చేసి, సీమాట్స్ విద్యార్థులు రికార్డు సాధించారు. రెండు గంటల్లోనే 653 మందికి పరీక్షలు సవిత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ పరిధిలోని హెల్త్ సైన్సెస్ బ్లాక్‌లో భారీ స్క్రీనింగ్ డ్రైవ్ నిర్వహించారు. నాలుగు గంటల సమయంలో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అయితే నర్సింగ్ కళాశాల బృందం తమ అసాధారణ సమన్వయంతో కేవలం రెండు గంటల్లోనే 653 మంది బాలికలకు స్క్రీనింగ్ పూర్తి చేసి రికార్డు సృష్టించింది. కౌమార దశలో ఉన్న బాలికల్లో రక్తహీనతను ముందుగానే గుర్తించడం, దానిపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ ఘనతను రాబా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా గుర్తించింది. నాట్యాచార్య తిలకవతి హాజరై, కళాశాల ప్రతినిధులకు మెడల్, ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. రికార్డు సాధించడంపై సీమాట్స్ గౌరవ చాన్సలర్ డాక్టర్ ఎన్‌ఎం.వీరయ్యన్, ప్రో చాన్సలర్ డాక్టర్ దీపక్ నల్లసామి, వైస్ చాన్సలర్ డాక్టర్ అశ్విని కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ షీజా వర్గీస్ మాట్లాడారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. విజయలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ ఎల్. పరిమళ, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎస్.తమిళసెల్వి నేతృత్వంలో ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్థులను అభినందించారు.


