పరాశక్తికి నుంచి క్రేజీ అప్‌డేట్
తమిళసినిమా: ప్రస్తుతం రూపొందుతున్న క్రేజీ చిత్రాల్లో పరాశక్తి ఒకటి. నటుడు శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో రవిమోహన్ ప్రతినాయకుడిగానూ, అధర్వ కీలక పాత్రలోనూ నటిస్తున్న ఇందులో క్రీజీ నటి శ్రీలీల నాయకిగా నటిస్తున్నారు. డాన్ ఫిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ పిరియాడికల్ కథా చిత్రానికి సుధాకొంగర కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈమె ఇంతకు ముందు ద్రోహి, ఇరుదు చుట్రు, సూరరై పోట్రు వంటి చిత్రాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. కాగా ముగ్గురు స్టార్ హీరోలు నటిస్తుండడంతో పరాశక్తి చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడంలో సాధారణమే. ఇప్పటికే చిత్ర టైటిల్‌కు చాలా పెద్ద స్పందన రావడంతో పాటూ చిత్రంపై నానాటికీ ఆసక్తి పెరిగిపోతోంది. దాన్ని మరింత హైప్ చేసే విధంగా చిత్ర షూటింగ్ పూర్తి అయినట్లు దీపావళి సందర్భంగా ఓ క్రేజీ ఫొటోను విడుదల చేశారు. అందులో నటుడు అధర్వ, శివకార్తికేయన్, రవి మోహన్ కలిసి నడిసొస్తున్న దృశ్యం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చిత్రాన్ని పొంగల్ సందర్భంగా 2026 జనవరి 14న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను రెడ్ జెయింట్ పిక్చర్స్ సంస్థ పొందడం మరో విశేషం.


