
మే 17న తెరపైకి మిషన్ ఇంపాజిబుల్
తమిళసినిమా: హాలీవుడ్ సూపర్‌స్టార్ టామ్ క్రూజ్ మరోసారి ప్రపంచ సినీ ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. ఈయన 1996లో నటించిన మిషన్ ఇంపాజిబుల్ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. దీంతో ఆ తరువాత వరుసగా దానికి 7 సీక్వెల్స్ రూపొంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈయన నటించిన మిషన్ ఇంపాజిబుల్ 7 చిత్రం ఏఐ టెక్నాలజీతో రూపొంది గత ఏడాది విడుదలై వసూళ్ల వర్షం కురిపించింది. తాజాగా తెరకెక్కిన మిషన్ ఇంపాజిబుల్–ది ఫైనల్ రిక్కానింగ్ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే నెల 17వ తేదీన భారతదేశంలో విడుదలకు సిద్ధం అవుతోంది. పారమౌంట్ పిక్చర్స్, స్కైడాన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నటుడు టామ్ క్రూజ్ నిర్మాత కాగా క్రిస్టోఫర్ మెక్వారి దర్శకత్వం వహించారు. యాక్షన్ ఎంటర్టెయినర్గా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్, ఇటీవలే విడుదలై విశేష స్పందనను తెచ్చుకుంది. అదే విదంగా ఇదే చివరి సీక్వెల్ అని తెలియడంతో మిషన్ ఇంపాజిబుల్ 8 చిత్రంపై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని మే నెల 23వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఇండియాలో ఆరు రోజుల ముందుగానే అంటే మే 17న ఇంగ్ల్లిష్, హిందీ, తెలుగు, తమిళం భాషల్లో విడుదల చేస్తున్నారు. దీంతో ఈ సమ్మర్లో భారతీయ సినీ ప్రేక్షకులకు సూపర్ ఎంటర్టెయినర్ ఇచ్చే చిత్రంగా మిషన్ ఇంపాజిబుల్–8 కానుందన్నమాట. ఆ తరువాతనే ఈ చిత్రం ఇతర దేశాల్లో కూడా విడుదల కానుంది.
తాజ్‌మహల్
ముందు నటుడు
టామ్ క్రూజ్