
గీత రచయిత వైరముత్తు, గాయని చిత్ర, దర్శకుడు తంగర్‌బచ్చన్
తమిళసినిమా: సినిమాలో కొన్ని జ్ఞాపకాలు తీపి గుర్తుగా మిగిలిపోతాయి. అలాంటి సంఘటనే ఇప్పుడు జరిగింది. తమిళసినిమాలో గీత రచయిత వైరముత్తు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇక చిన్న గానకోకిలగా పేరుగాంచిన గాయనీ చిత్ర గానామృతం గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు. కాగా 39 ఏళ్ల క్రితం వైరముత్తు రాసిన పూజైకేత్త పూవిదు అనే పాటను గాయనీ చిత్ర పాడారు. కాగా తాజాగా తంగర్‌బచ్చన్ దర్శకత్వంలో రూపొందుతున్న కరుమేఘంగళ్ కలైగిండ్రన చిత్రం కోసం వైరముత్తు రాసిన పాటను చిత్ర పాడారు. దీని గురించి వైరముత్తు మాట్లాడుతూ 39 ఏళ్ల క్రితం పాడిన చిత్ర గొంతులో అదే మాధుర్యం, ఆమె అణుకువ,అదే మర్యాద ఇప్పుడూ చూస్తున్నానన్నారు. కాగా చిత్ర దర్శకుడు తంగర్‌బచ్చన్ మాట్లాడుతూ 1990లో మలైచారల్ అనే చిత్రానికి తాను ఛాయాగ్రహణను అందించానని, అప్పుడు ఆ చిత్రానికి వైరముత్తు రాసిన పాటకు చిత్ర పాడారని గుర్తు చేశారు. అలాంటిది ఇప్పుడు తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న కరుమేఘంగళ్ కలైగిండ్రన చిత్రంలో వైరముత్తు రాసిని వరుం వరుం కరుమేఘంగలే అనే పాటను చిత్ర పాడారని చెప్పారు. ఇటా మళ్లీ తాము ముగ్గురు కలిసి పని చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలోనే నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.