
వివాహం చేసుకోనున్న జంటలను పరిచయం చేస్తున్న నిర్వాహకులు, అతిథులు
కొరుక్కుపేట: ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌కు అనుగుణంగా ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రమైన మహాబలిపురాన్ని వివాహ గమ్యస్థానంగా కూడా మార్చనున్నట్లు డబ్ల్యూవీ కనెక్ట్ సీఈఓ దక్షిణామూర్తి తెలిపారు. ఈ మేరకు బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో మధ్యతరగతి వారు కూడా వెడ్డింగ్ డెస్టినేషన్‌లను ఎంచుకుంటున్నారని.. అందువల్ల పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రాలను వెడ్డింగ్ వేదికలగానూ ప్రయోట్ చేయాలని పీఎం పిలుపునిచ్చారన్నారు.
ప్రధాని మోదీ పిలుపు మేరకు డబ్ల్యూవీ కనెక్ట్ –2023 పేరుతో చైన్నె మహాబలిపురంలోని రాడిసన్ బ్లూ టెంపుల్ బేలో ఏప్రిల్ 3,4,5 తేదీల్లో ఆసియాలోనే అతిపెద్ద వివాహ సమ్మెట్‌ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సదస్సులో భాగంగా కులమతాలకు అతీతంగా ఆర్థికంగా వెనుకబడిన పేద, దివ్యాంగులైన 101 జంటలకు ఉచితంగా సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది ప్రపంచంలోనే తొలిసారిగా చేపడుతున్నట్లు వివరించారు. ఈ సదస్సులో దేశంతోపాటు టర్కీ, ఇటలీ, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, శ్రీలంక దేశాల నుంచి 500లకు పైగా వెడ్డింగ్ ప్లానర్‌లు పాల్గొంటారని వివరించారు. కార్యక్రమంలో జీఆర్‌టీ గ్రూప్ సీఈఓ విక్రం కోట, డబ్ల్యూవీ డైరెక్టర్ నందిని విజయ్ తదితరులు పాల్గొన్నారు.