
అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే చంద్రన్
తిరుత్తణి: కృష్ణసముద్రంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని శనివారం ఎమ్మెల్యే చంద్రన్ ప్రారంభించారు. తిరుత్తణి యూనియన్ కృష్ణసముద్రం గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రూ.10.19 లక్షల వ్యయంతో అంగన్‌వాడీ కేంద్రం నూతన భవనం నిర్మించారు. శనివారం పంచాయతీ సర్పంచ్ నాగస్వామి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే చంద్రన్ అంగన్‌వాడీ సెంటర్‌ను, ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పౌష్టికాహార కేంద్రాన్ని ప్రారంభించారు. యూనియన్ కార్యదర్శి కృష్ణన్ పాల్గొన్నారు.