నిలువునా మోసం చేస్తున్నారు
ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు పండించిన ఉత్పత్తులు అమ్ముకునేందుకు ప్రభుత్వం నేటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. రెండు నెలల క్రితం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసినా ఇప్పటి వరకూ చలనం లేదు. కర్ణాటక నుంచి వ్యాపారులు ఇక్కడికొచ్చి ఉత్పత్తులు కొంటున్నా లాభం లేదు. వాళ్లు ఇష్టానుసారం ధర నిర్ణయించి రైతులను నిలువునా మోసం చేస్తున్నారు.
– లక్ష్మీనారాయణరెడ్డి, రైతు, జగరాజుపల్లి
అనుమతులు రాగానే కొనుగోళ్లు
ప్రభుత్వం వివిధ పంటలకు మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు ఇస్తే...వెంటనే కొనుగోళ్లు చేపడతాం. ఇప్పటికై తే జిల్లాలో వేరుశనగ, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. అనుమతులు రాగానే సచివాలయాలు, ఆర్‌ఎస్‌కేల ద్వారా పంట ఉత్పత్తులను కొంటాం.
– వంశీకృష్ణారెడ్డి,
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి
నిలువునా మోసం చేస్తున్నారు


