Sydney McLaughlin: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టావ్‌.. అంత ఆశ్చర్యమెందుకు?

Sydney McLaughlin BREAKS Women 400 Hurdles World Record - Sakshi

అమెరికాలోని ఒరేగాన్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల హార్డిల్స్‌లో ప్రపంచ రికార్డు బద్దలైంది. 400 మీటర్ల హార్డిల్స్‌లో అమెరికాకు చెందిన డబుల్‌ ఒలింపిక్‌ చాంపియన్‌.. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్‌ సిడ్నీ మెక్‌లాఫ్లిన్ కొత్త రికార్డు నమోదు చేసింది. శనివారం ఉదయం జరిగిన 400 మీటర్ల హార్డిల్స్‌ ఫైనల్లో మెక్‌లాఫ్లిన్‌ 50.68 సెకన్లలో గమ్యాన్ని చేరి స్వర్ణం తన ఖాతాలో వేసుకుంది.

ఈ నేపథ్యంలో మెక్‌లాఫ్లిన్‌ తన రికార్డు తానే బద్దలు కొట్టింది. ఇంతకముందు 400 మీటర్ల హార్డిల్స్‌లో లాఫ్లిన్‌ బెస్ట్‌ టైమింగ్‌ 51.41 సెకన్లు. జూన్‌లో యూఎస్‌ఏ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఔట్‌డోర్‌ చాంపియన్‌షిప్స్‌లో ఇదే వేదికపై పరిగెత్తి స్వర్ణం అందుకుంది. ఈ సందర్భంగా వరల్డ్‌ అథ్లెటిక్స్‌ అధికారిక ట్విటర్‌.. సిడ్నీ మెక్‌లాఫ్లిన్‌ ఫోటోను షేర్‌ చేస్తూ వరల్డ్‌ చాంపియన్‌.. వరల్డ్‌ రికార్డు.. మా సిడ్నీ మెక్‌లాఫ్లిన్‌..''  అంటూ క్యాప్షన్‌ జత చేసింది. 

ఇక డచ్‌ రన్నర్‌ ఫెమ్కే బోల్ 52.27 సెకన్లలో గమ్యాన్ని చేరి రతజం అందుకోగా.. అమెరికాకే చెందిన మరో అథ్లెట్‌ దలీలా ముహమ్మద్ 53.13 సెకన్లతో కాంస్యం చేజెక్కించుకుంది. స్వర్ణ పతకం సాధించిన అనంతరం ఆమె చెప్పిన మాట.. ''సాధించడానికి ఇంకా పరిగెడుతూనే ఉంటాను.'' ఇక్కడ మరో విచిత్రమేంటంటే ఫైనల్స్‌ పూర్తయిన తర్వాత.. మెక్‌లాఫ్లిన్‌ విజేత అని తెలిసిన తర్వాత కూడా ఇది నిజమేనా అన్న తరహాలో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ హైలైట్‌గా నిలిచింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top