
ఈ ఏడాది టీమిండియా స్వదేశంలో వరుస ద్వైపాక్షిక సిరీస్‌లో బీజీబీజీగా గడపనుంది. ప్రస్తుతం శ్రీలకంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోన్న భారత్.. అనంతరం మూడు మూడు వన్డేలు కూడా తలపడనుంది. ఈ లంకతో వన్డే సిరీస్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత జట్టు సిద్దం కానుంది. తొలుత వన్డే సిరీస్, అనంతరం టీ20 సిరీస్ జరగనుంది.
అయితే కివీస్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిని పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు ధృవీకరించారు. వీరిద్దరితో పాటు వెటరన్ ఆటగాళ్లు భువనేశ్వర్ కుమార్, అశ్విన్, మహ్మద్ షమీలను కూడా ఇకపై భారత టీ20 జట్టుకు దూరం పెట్టనున్నట్లు సమాచారం.
"విరాట్, రోహిత్‌తో పాటు వెటరన్ ఆటగాళ్లు న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపిక చేయబడరు. వారిద్దరిని జట్టును తొలగించడానికి మరేదో కారణం లేదు. మేము వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టును సిద్ధం చేయాలని భావిస్తున్నాము. ఈ క్రమంలోనే సీనియర్ ఆటగాళ్లకు టీ20లకు విశ్రాంతి ఇవ్వనున్నాం. చివరగా సెలక్టర్లు ఓ నిర్ణయం తీసుకున్నారు" అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా లంకతో టీ20 సిరీస్‌కు రోహిత్, కోహ్లి,భువనేశ్వర్ కుమార్ విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
చదవండి: PAK Vs NZ: ఎనిమిదేళ్ల తర్వాత తొలి సెంచరీ.. పాక్ ఆటగాడి సెలబ్రేషన్స్ మాములుగా లేవుగా!