Lalit Modi- Sushmita Sen: ఆమె మా అమ్మ స్నేహితురాలు కాదు.. పుట్టుకతోనే సంపన్నుడిని!

Lalit Modi Slams Trolls Relationship With Sushmita Minal Was Not His Mom Friend - Sakshi

ఐపీఎల్‌ సృష్టికర్త లలిత్‌ మోదీ.. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌తో తాను ప్రేమలో ఉన్నట్లు ప్రకటించి క్రీడా, సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాడు. సుస్మితను తన భాగస్వామి అని పేర్కొంటూ ఆయన షేర్‌ చేసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు లలిత్‌ మోదీపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్‌ చేశారు.

ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన లలిత్‌.. ఇప్పుడేమో కాలేజీ కుర్రాడిలా గర్ల్‌ఫ్రెండ్‌తో ఉన్నానంటూ ఫొటోలు షేర్‌ చేస్తున్నాడంటూ విపరీతంగా ట్రోల్‌ చేశారు. ఈ నేపథ్యంలో సుస్మితతో తన రిలేషన్‌షిప్‌పై స్పందించిన లలిత్‌ మోదీ ఆదివారం ట్విటర్‌ వేదికగా విమర్శకులకు కౌంటర్‌ ఇచ్చాడు. అదే విధంగా తన భార్య మినాల్‌ గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారంటూ మండిపడ్డాడు.

మధ్య యుగ కాలంలో ఉన్నామా?
ఈ సందర్భంగా సుస్మితా సేన్‌, తన దివంగత భార్య మినాల్‌ మోదీ, కూతురు అలియా మోదీలతో పాటు నెల్సన్‌ మండేలా, దలైలామా, భారత ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా తదితర ప్రముఖులతో కలిసి ఉన్న ఫొటోలను షేర్‌ చేస్తూ కౌంటర్‌ ఇచ్చాడు.

ఈ మేరకు.. ‘‘మనమింకా మధ్య యుగం కాలంలోనే నివసిస్తున్నామా? ఇద్దరు వ్యక్తులు స్నేహితులుగా ఉండకూడదా? ఒకవేళ వారి మధ్య కెమిస్ట్రీ కుదిరి కాలం కలిసి వస్తే.. అద్భుతం జరుగుతుంది కదా!.. నాదొక సలహా మీరు సంతోషంగా జీవించండి.. 

ఇతరులను కూడా వాళ్ల బతుకు వారిని బతకనివ్వండి. ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలుసుకుని వార్తలు రాయండి.. డొనాల్డ్‌ ట్రంప్‌ లాగా నకిలీ వార్తలు వ్యాప్తి చేయకండి’’ అంటూ మీడియాపై కూడా విరుచుకుపడ్డాడు. ఇక తన భార్య మినాల్‌ మోదీ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ప్రియమైన నా భార్య, దివంగత మినాల్‌ మోదీ.. మా పెళ్లి కంటే 12 ఏళ్ల ముందు నుంచి నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌.. 

అందరూ అనుకుంటున్నట్లుగా తను మా అమ్మ స్నేహితురాలు కాదు. కొంతమంది వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి చెత్త వార్తలు రాస్తున్నారు. మెదడు తక్కువ పనులు చేయొద్దు. ఎవరైనా ఓ వ్యక్తి తన దేశం కోసం.. లేదంటే వ్యక్తిగత జీవితంలో ఏదైనా సాధిస్తే ఎంజాయ్‌ చేయండి. మీ అందరి కంటే నేను బెటర్‌..

మీకంటే గొప్పగా తలెత్తుకుని తిరిగే అర్హత నాకుంది’’ అంటూ లలిత్‌ మోదీ సుదీర్ఘ నోట్‌ షేర్‌ చేశాడు. అదే విధంగా తనను ఆర్థిక నేరగాడు అని పిలిస్తే పట్టించుకోనన్న లలిత్‌ మోదీ.. తాను డైమండ్‌స్పూన్‌తో పుట్టానని.. పుట్టుకతోనే సంపన్నుడినని పేర్కొన్నాడు. తన వల్లే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పుట్టుకొచ్చిందని.. దేశానికి తాను ఓ గొప్ప బహుమతి ఇచ్చానని చెప్పుకొచ్చాడు. కాగా ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్‌ మోదీ ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్నాడు.

ఇక సుస్మిత సేన్‌తో మాల్దీవుల్లో లలిత్‌ ఫొటోలు షేర్‌ చేస్తూ బెటర్‌ పార్ట్‌నర్‌ అనడంతో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో ఇద్దరూ సోషల్‌ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. తాము ప్రేమలో ఉన్నామే తప్ప పెళ్లి చేసుకోలేదని వెల్లడించారు. కాగా సుస్మిత సైతం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికపుడు తన అప్‌డేట్లు పంచుకుంటుందన్న సంగతి తెలిసిందే.

చదవండి: Lalit Modi- Sushmita Sen: తనకంటే తొమ్మిదేళ్లు పెద్దది.. మినాల్‌ను పెళ్లాడేందుకు లలిత్‌ ఫైట్‌! చివరికి ఇలా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top