
ఉత్కంఠపోరులో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి..
ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి పాలైంది. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులకే పరిమితమైంది.
ఆఖరి ఓవర్‌లో ఎస్‌ఆర్‌హెచ్ విజయానికి 13 పరుగులు అవసరమవ్వగా.. ముఖేష్ కుమార్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో మయాంక్ అగర్వాల్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో నోర్జే,అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు సాధించగా.. ఇషాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్ తలా వికెట్ సాధించారు. అంతకముందు ఢిల్లీ కేపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది.
ఐదో వికెట్ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్
కెప్టెన్ మార్‌క్రమ్ రూపంలో ఎస్‌ఆర్‌హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. ఎస్‌ఆర్‌హెచ్ విజయానికి 18 బంతుల్లో 38 పరుగులు కావాలి.
నాలుగో వికెట్ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్
79 పరుగులు వద్ద ఎస్‌ఆర్‌హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
మూడో వికెట్ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్
75 పరుగులు వద్ద ఎస్‌ఆర్‌హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి.. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.
రెండో వికెట్ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్
73 పరుగులు వద్ద ఎస్‌ఆర్‌హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 49 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.
11 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్: 67/1
11 ఓవర్లు ముగిసే సరికి ఎస్‌ఆర్‌హెచ్ వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ అగర్వాల్(48), రాహుల్ త్రిపాఠి(11) ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్
145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన హ్యరీ బ్రూక్‌ను నోర్జే క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఎస్‌ఆర్‌హెచ్ టార్గెట్ 145
భువీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ కేపిటల్స్ చివరి ఓవర్‌లో కేవలం ఆరు పరుగులే చేయగలిగింది. 20 ఓవర్లలో ఢిల్లీ కేపిటల్స్ 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది.
18 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 132/6
18 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. క్రీజులో మనీష్ పాండే, రిపాల్ పటేల్ ఉన్నారు.
14 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 97/5
14 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ 5 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్ పటేల్, మనీష్ పాండే ఉన్నారు.
వారెవ్వా వాషింగ్టన్.. ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ వరుస క్రమంలో మూడు వికెట్లు కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ ఒకే ఓవర్‌లో వార్నర్,సర్ఫరాజ్ ఖాన్, అమాన్ ఖాన్‌ను పెవిలియన్‌కు పంపాడు. 8 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 62/5
రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ
మిచెల్ మార్ష్(25) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. నటరాజన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు మార్ష్ దొరికిపోయాడు. 5 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 41/2
తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్ వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఐపీఎల్-2023లో భాగంగా ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ రెండు మార్పులతో బరిలోకి దిగింది. జట్టులోకి రిపాల్ పటేల్, సర్పరాజ్ ఖాన్ వచ్చారు. అదే విధంగా ఎస్‌ఆర్‌హెచ్ జట్టులోకి టి నటరాజన్‌కు చోటు దక్కింది.
తుది జట్లు:
ఎస్‌ఆర్‌హెచ్: అభిషేక్ శర్మ, హ్యారీ బ్రూక్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్
ఢిల్లీ క్యాపిటల్స్ : డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, మనీష్ పాండే, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, రిపాల్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ