సూపర్‌ ఓవర్లతో అలసిపోయా: విలియమ్సన్‌

I am Getting Tired Of Coming Second In Super Overs, Williamson - Sakshi

చెన్నై:  2019 లో ఇంగ్లండ్‌లోని లార్డ్స్‌ వేదికగా జరిగిన వరల్డ్‌కప్‌ ఫైనల్‌ అందరికీ గుర్తుండే ఉంటుంది.  ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన తుదిపోరులో న్యూజిలాండ్‌ను పరాజయం వెక్కిరించింది. ఆనాటి మ్యాచ్‌ ఫైనల్లో రెండు సూపర్‌ ఓవర్లు పడగా రెండింటిలోనూ కివీస్‌కు కలిసిరాలేదు. ఆ రెండు సూపర్‌ ఓవర్లు టైగా ముగియగా, ఆ మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు ఆధారంగా ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు. దాంతో వరల్డ్‌కప్‌ సాధించాలన్న కివీస్‌ కల తీరలేదు.

ఇదే  విషయాన్ని తాజాగా ప్రస్తావించాడు విలియమ్సన్‌. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సూపర్‌ ఓవర్‌లో ఓడిపోయింది. దీనిపై విలియమ్సన్‌  మాట్లాడుతూ.. సూపర్ ఓవర్ ఎప్పుడున్నా.. కష్టతరమైన లక్ష్యాన్ని ఉంచాలి. తక్కువ స్కోరు ఉంచడంతో అది మాకు కలిసి రాలేదు. సూపర్ ఓవర్స్‌లో ఎదురైన ఓటములతో అలసిపోయాను.  కానీ ఈ టోర్నీలో ముందుకుసాగేందుకు కావాల్సిన సానుకూల అంశాలు లభించాయి. క్రికెట్‌లో ఇలాంటి విచిత్రాలు జరుగుతూనే ఉంటాయి. మ్యాచ్‌లు టైగా ముగుస్తుంటాయి.  ఇది కొత్త ఉత్సహాన్ని ఇస్తాయి. ప్రేక్షకులకు మంచి జోష్‌ను తీసుకొస్తాయి’ అని తెలిపాడు. 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఆదివారం ఆసక్తికరంగా సాగిన పోరులో చివరకు ఢిల్లీ క్యాపిటల్స్‌దే పైచేయి అయింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్, ఢిల్లీ స్కోర్లు ‘టై’ కావడంతో చివరకు ఫలితం సూపర్‌ ఓవర్‌ ద్వారా తేలింది. ఈ ఓవర్లో ముందుగా రైజర్స్‌ 7 పరుగులు చేయగా...ఢిల్లీ 8 పరుగులు చేసి విజయాన్నందుకుంది.

ఇక్కడ చదవండి: హర్షల్‌ బౌలింగ్‌ గురించి ధోని ముందే చెప్పాడు: జడేజా
మీ విదేశీ ఆటగాళ్లను ఇవ్వండి: ఆర్‌ఆర్‌ రిక్వెస్ట్‌
ఐపీఎల్‌ 2021: వెళ్లాలనుకుంటే వెళ్లిపోవచ్చు..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top