చైతన్య భారతి: సచిన్‌ టెండూల్కర్‌ / 1973 | Azadi Ka Amrit Mahotsav: Sachin Tendulkar | Sakshi
Sakshi News home page

చైతన్య భారతి: సచిన్‌ టెండూల్కర్‌ / 1973

Jul 12 2022 4:32 PM | Updated on Jul 12 2022 5:23 PM

Azadi Ka Amrit Mahotsav: Sachin Tendulkar - Sakshi

ఆటకు విధేయుడు

నేను క్రికెట్‌ స్టేడియం బాక్స్‌లో కూర్చొని టెండూల్కర్‌ గొప్ప ప్రదర్శనను చూస్తూ ఆనందిస్తున్నప్పుడల్లా నా మనసులో ఒక ప్రశ్న వెంటనే మెదిలేది. ఆయన తన ప్రయాణంలో ఎంతో ఆనందాన్ని పొందారు. ఎంతో ఆనందాన్ని మనకు పంచారు. అయితే ఈ ప్రయాణంలో గొప్పతనం ఆయనకు ఎప్పుడు వచ్చి చేరింది?  అది ఆయన 14 ఏళ్లప్పుడు పాఠశాలలో 5 ఇన్నింగ్స్‌లో 1028 పరుగులు చేసినప్పుడు మొదలైందా? వాటిలో 4 ఇన్నింగ్స్‌లో ఆయన నాటౌట్‌గా ఉండడంతో ఆయన పరుగుల సగటు 1028 అయినప్పుడా? లేక 15 ఏళ్ల వయసులో సినిమాలు, చాక్లెట్లు, మిల్క్‌ షేక్‌ల గురించి ఆలోచించడానికి బదులు వెస్టిండీస్‌లో మార్షల్, ఆంబ్రోస్, వాల్ష్, బిషప్‌ల బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తున్నప్పుడు జరిగిందా? ఇంకా, 16 ఏళ్లప్పుడు టెస్ట్‌ మ్యాచ్‌ ఆడటానికి మైదానంలోకి వెళుతూ ఈ దశలో బౌలర్‌లను గౌరవించడం ముఖ్యం అనే సూచనను విన్నప్పుడు ఆయన గొప్పదనం మొదలైందా? ఇమ్రాన్‌ ఖాన్, వాసిమ్‌ అక్రమ్, వకార్‌ యూనిస్, అఖిబ్‌ జావెద్‌లకు తగిన జవాబు ఇచ్చినప్పుడా లేక బౌలర్ల పని తనకు సరైన లయతో బౌలింగ్‌ చేయడమేనని ఆలోచించినప్పుడు జరిగిందా? 17 ఏళ్ల వయసులో ఆయన సెంచరీ చేసి తన జట్టును ఓటమి నుంచి కాపాడారు. బంతుల్ని వరుసగా బౌండరీకి తరలించారు.

ఆయన గొప్పతనం అప్పుడే మొదలై ఉంటుందా? లేక 18 ఏళ్ల వయసులో ఆయన ఆస్ట్రేలియాలో ఆడుతూ ఆ ఆటగాళ్ల వాగుడు యుద్ధానికి తగిన జవాబు ఇస్తానని తన భాగస్వామితో చెప్పినప్పుడు అది జరిగి ఉంటుందా? అత్యద్భుతమైన ఆత్మ విశ్వాసంతో ఆయన ఆ విధంగా తాను జీవితాంతం ఏ ప్రశ్నకైనా తన బ్యాట్‌తోనే సమాధానం చెబుతానని ప్రకటించారు. ఇంకా ఆయన భుజాల మీదకు గొప్పతనం 21 ఏళ్లకే 7 టెస్ట్‌ సెంచరీలు చేసి కొత్త చరిత్రను సృష్టించినప్పుడు వాలిందని అనుకోవచ్చా? ఇలా చెప్పుకుంటూపోతే ఓ పుస్తకం తయారవుతుంది. ఆయన జీవితంలో ఎన్నో గొప్ప సందర్భాలున్నాయి. అందుకే ఆయనకు గొప్పదనాన్ని నిర్వచించే సందర్భం ఫలానాది అని కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. అయితే, సచిన్‌ను మొదటిసారి కలిసి 21 ఏళ్లు గడిచిన తర్వాత మళ్లీ కలిసినప్పుడు.. మైదానం లోపల, వెలుపల ఎప్పుడూ ఆయన వెన్నంటి ఉండే హూందాతనంలోనే ఆయన గొప్పదనం దాగుందనిపించింది. ఆయన ఆటను జయించినప్పటికీ, ఆటకు విధేయుడిగా ఉన్నారు. సచిన్‌ గొప్పదనం అదేనని నేను అనుకుంటున్నాను. 
– హర్షా భోగ్లే, క్రికెట్‌ వ్యాఖ్యాత, కాలమిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement