
మంత్రి సీతక్కకు సన్మానం
నారాయణఖేడ్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమితులైన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను మంగళవారం హైదరాబాద్‌లో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ కలిసి పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఆయన వెంట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేష్ షెట్కార్, సీనియర్ నాయకులు అశోక్ ఉన్నారు.