ప్రకటనలు తప్ప పల్లె ప్రగతికి నిధులేవి?  | Telangana: Etela Rajender Comments On CM KCR | Sakshi
Sakshi News home page

ప్రకటనలు తప్ప పల్లె ప్రగతికి నిధులేవి? 

Jun 6 2022 1:33 AM | Updated on Jun 6 2022 9:05 AM

Telangana: Etela Rajender Comments On CM KCR - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు ప్రకటనలు తప్ప నిధులివ్వడం లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌ ఆరోపించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రజల్లేక వెలవెలబోతున్నాయని, అందుకే స్థానిక ప్రజాప్రతినిధులు ముఖం చాటేస్తున్నారని విమర్శించారు.

ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..గ్రామీణ స్థానిక సంస్థలకు, పంచాయతీలకు కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం, 15వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలేదని ఆరోపించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చి న నిధులపై సీఎం కేసీఆర్‌తోగానీ, ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో గానీ చర్చకు సిద్ధమని తెలిపారు. ప్రభుత్వం చెబుతున్న మాటలకు చేస్తున్న పనులకు ఏమాత్రం పొంతనలేదని అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement