
నెల్లూరు: మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఒక్క హామీని కూడా నెరవేర్చని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. హామీలను అమలు చేస్తున్న జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు చంద్రబాబు, వైఎస్ జగన్ పాలనల్లో వ్యత్యాసం చాలా ఉందన్న కాకాణి.. ప్రస్తుతం పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమం అందుతోందన్నారు.
అమ్మ ఒడిపై పై పచ్చ మీడియా దుష్ప్రచారం చేస్తోందని, ఐదేళ్ల పాలలో ప్రజా సంక్షేమాన్ని చంద్రబాబు గాలి కొదిలేశారన్నారు. బాధ్యతుల చేపట్టిన రోజు నుంచి అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం జగన్ శ్రమిస్తున్నారని, 2024 ఎన్నిల్లో జిల్లాలో క్లీన్‌స్వీప్ చేసి చరిత్ర తిరగరాద్దామని కాకాణి విశ్వాసం వ్యక్తం చేశారు.