
● 2022–23లో ప్రభుత్వానికి భారీగా ఆదాయం ● జిల్లాలో కిక్కిచ్చిన లిక్కర్ విక్రయాలు.. జోరుగా రిజిస్ట్రేషన్లు
సాక్షి, పెద్దపల్లి: గతేడాది ఆర్థికసంవత్సరం మొదలైనప్పటినుంచి వివిధ శాఖల ద్వారా ప్రభుత్వ ఆదాయం ెదండిగా రావటంతో ఖజానా నిండింది. కరోనా లాక్‌డౌన్ ప్రభావం పూర్తిగా తొలగిపోవడం, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు, మద్యం అమ్మకాల జోరు.. తదితర వాటితో గతేడాది జిల్లాలో ప్రభుత్వ రాబడి పెరిగింది. ఎప్పటిలాగే ప్రభుత్వానికి మద్యం అమ్మకాలు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారానే ఆదాయం ఎక్కువగా సమకూరింది.
రిజిస్ట్రేషన్ శాఖకు కాసుల వర్షం
జిల్లాలో పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుండగా వీటి పరిధిలో క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. జిల్లా కేంద్రం ఏర్పాటుతో రియల్ వ్యాపారం భారీగా జరుగుతోంది. రిజిస్ట్రేషన్ ఫీజులు, భూముల ధరల పెరుగుదల నేపథ్యంలో రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు సాగాయి. పెద్దపల్లి సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 2020లో 7,057 డాక్యుమెంట్‌లు రిజిస్ట్రేషన్‌కాగా రూ.25,19,22,000 ఆదాయం సమకూరింది. 2021లో 13,237 డాక్యుమెంట్‌లు రిజిస్ట్రేషన్ కాగా రూ.44,12,60,000 ఆదాయం వచ్చింది. 2022లో కేవలం 2,594 డాక్యుమెంట్‌లతో రూ.14,39,49,000 ఆదాయం రాగా, ఈఏడాది 9,873 డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేయగా రూ.51,05,62,000 ఆదాయం వచ్చింది. సుల్తానాబాద్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో గతేడాది 175 డాక్యుమెంట్స్‌తో రూ.43,56,910 ఆదాయం రాగా, ఈ యేడాది 1,969 డాక్యుమెంట్స్‌తో రూ.6,24,14000 ఆదాయం సమకూరింది. మంథనిలో గతేడాది 1,962 డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేయగా రూ.4కోట్ల ఆదాయం వచ్చింది. ఈయేడాది 2,085 డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేయటంతో 4.84 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది.
మద్యం అమ్మకాలతో..
జిల్లాలో 77మద్యం దుకాణాలు, 16 బార్లు ఉన్నాయి. ఎకై ్సజ్‌శాఖకు ఏటా పెరగుతున్న మద్యం అమ్మకాలతో ఆదాయం పెరుగుతోంది. 2020–21లో రూ.627.47కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగ్గా, 2021–22లో రూ.631.12 కోట్లు, 2022–23లో రూ.622.91కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.