
గుర్తు తెలియని వృద్ధురాలు మృతదేహం
విజయనగరం అర్బన్: జిల్లాలోని రెండు ఈ – డివిజన్ మేనేజర్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బొబ్బిలి, చీపురుపల్లి రెవెన్యూ డివిజన్లలో ఒక్కో ఖాళీ ఉందన్నారు. అభ్యర్ధులు బీసీఏ, బీఎస్‌సీ కంప్యూటర్స్, బీఈ సీఈసీ లేదా ఐటీ, బీటెక్ సీఎస్‌ఈ లేదా ఐడీ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండి ఇంగ్లిష్‌లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలని తెలిపారు. వయస్సు జూలై 1, 2022 నాటికి 21 – 35 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు. నెలకు రూ.22,500 వేతనం ఇస్తామని కాంట్రాక్టు కాలం ఒక ఏడాది ఉంటుందని తెలిపారు. ఇవి కేవలం కాంట్రాక్టు ఉద్యోగాలు మాత్రమేనని స్పష్టం చేశారు. దరఖాస్తుదారులకు రాతపరీక్ష నిర్వహిస్తామని దానిలో ఉత్తీర్ణులైన వారికి జిల్లా కమిటీ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారని తెలిపారు. రెండేళ్లపాటు ఐటీ రంగంలో అనుభవం ఉన్న వారికి 5 శాతం వెయిటేజ్ మార్కులను ఇస్తామని పేర్కొన్నారు. అధికారులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించిన నకిలీ ధ్రువపత్రాలను సమర్పించిన దరఖాస్తులను తిరస్కరించడం జరుగుతుందని వివరించారు.
గుర్తు తెలియని మహిళ మృతి
విజయనగరం క్రైమ్: స్థానిక ఎన్‌సీఎస్ థియేటర్ పక్కన ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఎదురుగా సుమారు 45 నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న మహిళ మృతి చెందినట్లు వన్‌టౌన్ పోలీసులు శనివారం తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. కుటుంబ సభ్యులెవరైనా గుర్తిస్తే వన్‌టౌన్ పోలీసులను సంప్రదించాలని వన్‌టౌన్ సీఐ వెంకటరావు కోరారు.
ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు
విజయనగరం క్రైమ్: తన అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా అయినట్లు రైల్వేస్టేషన్ సమీపంలో నివాసం ఉంటున్న ఉమ అనే మహిళ ఫిర్యాదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ బి.వెంకటరావు శనివారం తెలిపారు. గుర్తు తెలియని మెసేజ్‌లు, లింక్ ఓపెన్ చేయడంతో వారి అకౌంట్ నుంచి రూ.88వేల 435 విత్ డ్రా అయినట్లు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.