స్వాహా..!
న్యూస్‌రీల్
విలువైన భూములపై టీడీపీ నేతల కన్ను
కొన్నా హక్కులు రావు
రైతులకు బెదిరింపులు
పశ్చిమ డెల్టాకు నీటి నిలుపుదల
పులిచింతల ప్రాజెక్టు సమాచారం
సాగర్ నీటిమట్టం వివరాలు
పల్నాడు
సోమవారం శ్రీ 1 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
అసైన్డ్
ప్రభుత్వం పేదలకు కేటాయించిన భూముల్లో ఎవరి భూములు ఎక్కడ అనే దానిపై రైతులకు స్పష్టత లేదు. భూ ఆక్రమణదారులు మాత్రం ప్రధాన రహదారికి ఒక పక్కన ఉన్న చెరువులను మొత్తం ఆక్రమించి చెరువు కట్టలను ధ్వంసం చేయడంపై పలువురు రైతులు ప్రశ్నించారు. దీంతో ఈ ముఠా సభ్యులు వారిపై బెదిరింపులకు దిగారు. అధికారం మాది.. మేం చెప్పినట్టు వింటే డబ్బులు వస్తాయి లేకుంటే మీ భూమి కూడా మీకు ఉండదు అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. భూముల ఆక్రమణ వెనుక పెద్దల హస్తం ఉందని భావించిన రైతులు దీనిపై మాట్లాడేందుకు కూడా భయపడుతున్నారు.
నరసరావుపేట రూరల్: భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములపై అధికారపార్టీ నాయకుల కళ్లు పడ్డాయి. మాయమాటలతో పేదలను లోబర్చుకుని నామమాత్రంగా డబ్బులు చెల్లించి అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. 20 ఎకరాలకు పైగా ఇప్పటికే భూ బకాసురుల చేతుల్లోకి వెళ్లగా భూములు ఇవ్వని రైతులపై బెదిరింపులకు దిగుతున్నారు. దీనిపై అధికారులకు సమాచారం ఉన్నా అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారు.
మండలంలోని పమిడిమర్రు గ్రామంలోని వంద ఎకరాలకు పైగా అసైన్డ్ భూమి ఉంది. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2008లో గ్రామంలోని పేదలకు ఈ భూములను కేటాయించారు. సర్వే నెంబరు 44, 45లో దాదాపు 92 మంది రైతులకు 82 ఎకరాలను కేటాయించి పట్టాలు పంపిణీ చేశారు. అప్పటి నుంచి రైతుల ఆధీనంలోనే భూములు ఉన్నాయి. రైతులకు పట్టాలు ఇచ్చారు కానీ ఎవరి భూమి ఎక్కడ అనేది అధికారులు చూపలేదు. దీంతో రైతులు ఉమ్మడిగా చేపల చెరువుల నిర్వాహకులకు కౌలుకు ఇచ్చి ప్రతి ఏడాది కౌలు పొందుతున్నారు.
పేదలకు కేటాయించిన భూముల్లో ఉన్న చేపల చెరువులను ఆక్రమణదారులు పొక్లెయిన్‌లతో పూడ్చివేస్తున్నారు. దాదాపు నెల రోజులుగా గ్రామంలో భూ ఆక్రమణదారుల హడావుడి నెలకుంది. ట్రాక్టర్లు, పొక్లెయిన్లతో చెరువు కట్టలను పగులకొట్టి భూములను తమ స్వాధీనంలోకి తీసుకుంటున్నారు. దాదాపు 20 ఎకరాలకు పైగా ఇదే విధంగా చదును చేశారు.
పమిడిమర్రులో ఆక్రమణకు గురవుతున్న భూములు విలువ ఎకరం రూ.10లక్షల నుంచి రూ.15లక్షల వరకు ఉన్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ఆక్రమణదారులు రైతులకు ప్రస్తుతం ఎకరానికి రూ.50వేలు చెల్లించి అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. విడతల వారీగా ఎకరానికి రూ.2లక్షలు చెల్లిస్తామని నమ్మించి భూములను ఆక్రమిస్తున్నారు.
పొక్లెయిన్‌తో చేపల చెరువు కట్టలను ధ్వంసం చేస్తున్న దృశ్యం
7
పమిడిమర్రు నుంచి కాకాని జేఎన్‌టీయూఎన్‌కు వెళ్లే దారిలో ఉన్న ఈ భూములపై అధికార పార్టీ నాయకుల కళ్లు పడ్డాయి. వంద ఎకరాలకు పైగా అసైన్డ్ భూమి ఒక్క చోటే ఉండటంతో దీనిని సొంతం చేసుకునేందుకు పావులు కదిపారు. గ్రామంలోని టీడీపీ నాయకుడిని రంగంలోకి దింపి పేదలకు డబ్బు ఆశ చూపి భూములను సొంతం చేసుకుంటున్నారు. గ్రామంలోని టీడీపీ నాయకుడితో పాటు పట్టణానికి చెందిన దళిత సంఘం నాయకుడు ఇందులో కీలకపాత్ర పొషిస్తున్నారు. దళితులకు చెందిన భూములు ఎక్కువగా ఉండటంతో ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని తెరమీదకు తెచ్చి ముఖ్యనేతలు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నట్టు సమాచారం. ఇప్పటికి 20 మందికి పైగా రైతుల నుంచి భూమిని స్వాధీనం చేసుకున్నారు.
పేదలకు కేటాయించిన భూములు కొనుగోలు చేసిన వారికి ఆ భూములపై ఎటువంటి హక్కు ఉండదు. అసైన్డ్ భూముల విక్రయాలు జరుగుతున్న విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.
– వేణుగోపాలరావు, తహసీల్దార్
దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి పశ్చిమ డెల్టాకు నీటి విడుదల నిలుపుదల చేశారు. సముద్రంలోనికి 3,625 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 400 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. నీటి నిల్వ 42.1600 టీఎంసీలు.
విజయపురిసౌత్: నాగార్జుసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 580.60 అడుగులకు చేరింది. ఇది 284.7452 టీఎంసీలకు సమానం.
స్వాహా..!
స్వాహా..!
స్వాహా..!
స్వాహా..!
స్వాహా..!
స్వాహా..!


