కష్టాల ‘ప్లాజా’ !
● బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద
వాహనదారుల ఇక్కట్లు
● ఫ్రీ లెఫ్ట్ మార్గాలను
మూసివేయించిన అధికారులు
● అంబులెన్సులు సైతం
క్యూలో రావల్సిందేనంటూ హుకుం
మార్టూరు: జాతీయ రహదారిపై ఉన్న బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద అధికారులు, సిబ్బంది తీరుతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారుల నుంచి సంవత్సరానికి రూ.కోట్లు టోల్ ఫీజు వసూలు చేస్తున్నా.. వారి అవసరాలకు సరిపడా సౌకర్యాలను సమకూర్చడం లేదని ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న అధికారులు మరో కొత్త సమస్యకు తెర లేపడం గమనార్హం. టోల్ ప్లాజాకు ఇరువైపులా ఫ్రీ లెఫ్ట్ పేరుతో రెండు మార్గాలు ఉంటాయి. ఈ మార్గాల్లో వీవీఐపీల వాహనాలు, అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు, కలెక్టర్, కేంద్ర, రాష్ట్రస్థాయి అధికారుల వంటి అత్యవసర వాహనాలు టోల్ ఫీజుతో సంబంధం లేకుండా వెళ్లిపోతుంటాయి. వీటితోపాటు టోల్ ప్లాజా పరిసర గ్రామాలకు చెందిన రైతుల ట్రాక్టర్లు, ఇతర వాహనాలు సైతం లోకల్ పాస్‌తో ఈ మార్గాల్లోనే వెళ్లి పోతుంటాయి. ఈ కారణంగా ఈ అత్యవసర వాహనాలు ఆలస్యం లేకుండా ప్రయాణం చేయడానికి వీలు కలుగుతుంది. ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తదు.
● అదే రోజు అర్ధరాత్రి మార్టూరు వైపు నుంచి ఒంగోలుకు రోగులతో వెళ్తున్న ఓ అంబులెన్స్ ఫ్రీ లెఫ్ట్ మార్గం మూసి వేసి ఉండటంతో మిగిలిన వాహనాలతో పాటు క్యూలోనే ఉండటంతో రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాపాయంలో ఉన్న రోగుల పరిస్థితి చూసి ముఖ్యమంత్రి స్థాయి ప్రజాప్రతినిధులే అంబులెన్సకు దారి వదులుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయినా బొల్లాపల్లి టోల్ ప్లాజా అధికారులు మాత్రం ఇందుకు మినహాయింపులాగా వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
● ఈ విషయమై సిబ్బందిని వివరణ కోరగా.. ఇటీవల కొత్తగా వచ్చిన అధికారి ఆదేశాలతో తాము ఫ్రీ లెఫ్ట్ మార్గాలను మూసివేసినట్లు తెలిపారు. ఇప్పటికై నా టోల్ ప్లాజా ఉన్నతాధికారులు స్థానిక సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని వాహనదారులు, ప్రయాణికులు, పరిసర గ్రామాల ప్రజలతో పాటు టోల్ ప్లాజా సిబ్బంది సైతం కోరటం విశేషం.


