అత్యవసర వాహనాలు సైతం క్యూలోనే..
గత నెల రోజులుగా ఫ్రీ లెఫ్ట్ మార్గాలను రెండు వైపులా అధికారులు సిబ్బందితో మూసి వేయించారు. దీనివలన అత్యవసరంగా వెళ్లవలసిన వాహనాలతో పాటు పరిసర గ్రామాలకు చెందిన రైతుల వాహనాలు సైతం మిగిలిన వాహనాలతో పాటు ప్లాజా రూటులోనే ప్రయాణిస్తున్నాయి. దీంతో ప్రయాణంలో జాప్యం పెరిగి వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎప్పటిలాగే ఫ్రీ లెఫ్ట్ మార్గంలోనే వెళ్తామంటూ సమీప గ్రామానికి చెందిన కొందరు రైతులు గత గురువారం ట్రాక్టర్‌తో ఆ మార్గానికి అడ్డుగా ఉంచిన సిమెంట్ దిమ్మెలను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ విషయమై రైతులు టోల్ ప్లాజా సిబ్బందికి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. అయినప్పటికీ సిబ్బంది ఆ మార్గంలో ఉంచిన అడ్డంకులను తొలగించకపోవడం గమనార్హం.


