ఏపీ గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి శంకుస
నెహ్రూనగర్: అమరావతిలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా బ్యాంక్ చైర్మన్ కె.ప్రమోద్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ బ్యాంక్‌కు రాష్ట్ర వ్యాప్తంగా 1,351 శాఖల ద్వారా ఒక కోటి ముఫ్పై లక్షల ఖాతాదారులకు నాణ్యతతో కూడిన బ్యాంకింగ్ సేవలను అందిస్తూ, రాష్ట్రంలో అగ్రగామి బ్యాంకుగా ఎదుగుతోందన్నారు. ప్రస్తుతం ప్రధాన కార్యాలయం గుంటూరు బ్రాడీపేటలో పనిచేస్తోందని, అమరావతిలో కేటాయించిన స్థలానికి నిర్మాణ అనుమతులు రాగానే నూతన భవన నిర్మాన పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.


