అన్నదాత..దుఃఖీభవ
అన్నదాత సుఖీభవ పథకంలో అర్హులకు అన్యాయం రెండవ విడతలో 2,40,530 మంది అర్హులని తేల్చిన ప్రభుత్వం అర్హులైన రైతులకు సైతం నేటికీ అందని పెట్టుబడి సాయం వైఎస్సార్ సీపీ హయాంతో పోలిస్తే 40,222 మంది రైతులకు మొండిచేయి ఏకంగా బతికి ఉన్న రైతును చనిపోయినట్లు చూపుతున్న అధికారులు
చంద్రబాబు కోతలు
నాకు సొంత భూమి 1.23 ఎకరాలు ఉంది. దీనికి తోడు 1.25 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నా. మొదటి విడత అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ జమయ్యాయి. రెండో విడత ఈ నెల 19న అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ రూ.2 వేలు జమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.5వేలు జమ కాలేదు. ఇదేమిటని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదిస్తే, వారు చెప్పిన మాటలు విని ఖంగుతిన్నంత పని అయ్యింది. బతికి ఉండగానే చనిపోయానిని పోర్టల్‌లో చూపుతోంది. ఈ ఘోరం ఏమిటో అర్థం కావటం లేదు.
– పెండ్యాల నాగమురళి, రైతు, కంకణాలపల్లి
సత్తెనపల్లి: అన్నదాత సుఖీభవ పథకం రైతులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. 2024–25లో సాయాన్ని ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2025–26లో మొదటి విడత పెట్టుబడి సాయాన్ని 2025 ఆగస్ట్ 2న విడుదల చేశారు. మొదటి విడతలో 2,39,959 మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఆ తర్వాత అర్హతలు ఉన్నా సాయం అందలేదనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నెల 19న రెండో విడత అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించి మొదటి విడత జాబితానే పరిగణలోకి తీసుకోవడం చూస్తే వేలాది మంది రైతులకు ఈ విడత కూడా నిరాశ తప్పని పరిస్థితి.
పీఎం కిసాన్‌తో కలిపి పెట్టుబడి సాయం...
చంద్రబాబు ప్రభుత్వం 2025 ఆగస్ట్ 2న తొలి విడతగా 2,39,959 రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ సాయాన్ని పరిమితం చేసింది. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కింద రూ.167.97 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించింది. ఈ నెల 19న రెండో విడత 2,40,530 మంది రైతులకు రూ.158.91 కోట్లు విడుదల చేసింది. వైఎస్సార్ సీపీ పాలనలో వైఎస్సార్ రైతు భరోసా కింద లబ్ధి పొందిన రైతులతో పోలిస్తే జిల్లాలో 40,222 మంది రైతులకు మొండి చేయి చూపింది. 2024 ఎన్నికల సమయంలో పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించిన చంద్రబాబు, ఇప్పుడు పీఎం కిసాన్‌తో కలిపి ఇస్తుండడం గమనార్హం.
నాకు సొంత భూమి ఎకరం ఉంది. పత్తి సాగు చేస్తున్నా. ప్రకృతి వైపరీత్యాలతో మోంథా తుఫాన్‌కు తడిసి పత్తి కాయలు నల్లగా మారాయి. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌కు అర్హుడునని నా సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. కానీ రెండు విడతల్లోనూ పెట్టుబడి సాయం లబ్ధి చేకూరలేదు. రైతు సేవా కేంద్రానికి వెళ్లి అడిగితే ప్రాసెస్‌లో ఉందని చెబుతున్నారు. రెండో విడత కూడా నిధులు విడుదలైతే ఇంకా మొదటి విడత కూడా నాకు అంద లేదు. సమస్య ఎక్కడ ఉందో అధికారులు పరిశీలించి లబ్ధి చేకూర్చాలి.
– బన్నారావూరి వెంకటేశ్వరరావు,
రైతు, లేమల్లె
2019–20 2,41,515 326.04
2020–21 2,50,469 338.13
2021–22 2,48,812 335.90
2022–23 2,66,871 360.27
2023–24 2,80,181 378.24
అన్నదాత..దుఃఖీభవ
అన్నదాత..దుఃఖీభవ
అన్నదాత..దుఃఖీభవ


