వైభవంగా సాయిబాబా ఆలయ ప్రతిష్ఠ
బెల్లంకొండ: మండలంలోని వన్నాయపాలెం గ్రామంలో గురువారం సాయిబాబా నూతన ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తురాలు మద్దిబోయిన సావిత్రమ్మ రూ.1.70 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించారు. గురువారం ఉదయాన్నే ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. స్థానికుల సహకారంతో భారీగా అన్నదానం ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అంతకుముందు ఆయనకు గ్రామస్తులు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు. గ్రామస్తులందరూ సోదర భావంతో మెలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈదా సాంబిరెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, అనుముల రోశిరెడ్డి, మర్రి ప్రసాదరెడ్డి, చింతారెడ్డి సాయిరెడ్డి, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు మేకల వెంకటేశ్వర్లు, గ్రామ నాయకులు మేకల లక్ష్మయ్య, సాంబశివరావు, ఆరుద్ర నరసింహారావు, గమిడి కోటి నాగయ్య, సాయి గణేష్ తదితరులు పాల్గొన్నారు.


