దళితులపై వేధింపులు
●జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమ్ము చంద్రశేఖర్, నాయకులు
●దళిత వర్గాలపై కేసులు పెడుతూ బాధిస్తున్న చంద్రబాబు సర్కార్
● వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
నరసరావుపేట: చంద్రబాబు సర్కార్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్‌బుక్ రాజ్యాంగంతో దళితులపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమ్ము చంద్రశేఖర్ విమర్శించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు సుధాకర్‌బాబు ఆదేశాలతో బుధవారం పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో స్థానిక గడియార స్తంభం సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
● చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్‌లో దళితుల సమస్యలపై పార్టీ తరఫున రాజీలేని పోరాటం చేస్తామని పేర్కొన్నారు.
● రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కందుల ఎజ్రా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు.
● జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత పాల్ మాట్లాడుతూ అట్టడుగున ఉన్న బడుగు, బలహీనవర్గాలలో ఉన్న అన్ని కులాలకు చేయూతనిచ్చేలా అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు.
●పార్టీ పట్టణ అధ్యక్షుడు కరీముల్లా మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు.
● పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలపర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని ఎవరైనా అమలుపరచారంటే అది ఒక్క వైఎస్సార్ మాత్రమేనని తెలియజేశారు.
● సామాజిక సేవకులు ఈదర గోపీచంద్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అంబేడ్కర్‌కు సరైన గౌరవం ఇవ్వడం లేదని, విజయవాడలోని సామాజిక మహా శిల్పాన్ని సందర్శించకుండా ఆయన్ను అవమానించే చర్యలకు పాల్పడటం బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గంటెనపాటి గాబ్రియల్, రాష్ట్ర విద్యార్థి విభాగ ప్రధాన కార్యదర్శి ఉప్పుతోళ్ల వేణుమాధవ్, జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షులు గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి నెలటూరి సురేష్, యువజన విభాగ నియోజకవర్గ అధ్యక్షుడు మణీంద్రరెడ్డి, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ బూదాల కల్యాణ్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ అచ్చి శివకోటి, రొంపిచర్ల ఎస్సీ సెల్ అధ్యక్షులు గుండాల వెంకటేష్ పాల్గొన్నారు.


