ఐఎంఏ గుంటూరు శాఖకు అవార్డులు
గుంటూరు మెడికల్ : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) గుంటూరు శాఖకు వివిధ రంగాల్లో అందించిన సేవలకు లభించిన అవార్డులను ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ బన్సాలి నుంచి గుంటూరు ఐఎంఏ శాఖ కార్యనిర్వహకవర్గం అందుకుంది. ఇటీవల అన్నమయ్య జిల్లా రాజంపేటలో నిర్వహించిన ఐఎంఏ రాష్ట్ర సదస్సులో ఈ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డులను ఐఎంఏ గుంటూరు శాఖ అధ్యక్షులు డాక్టర్ టి.సేవకుమార్, కార్యదర్శి డాక్టర్ బి.సాయికష్ణ, డాక్టర్ వి.మహేష్ డాక్టర్ డి.అమరలింగేశ్వరరావు, డాక్టర్ ఎన్.కిషోర్, డాక్టర్ ఎం.పర్నికుమార్ తదితరులు డాక్టర్ బన్సాలి నుంచి అందుకున్నారు. గుంటూరు శాఖకు ఐదు అవార్డులు దక్కటం పట్ల పలువురు వైద్య ప్రముఖులు అభినందనలు తెలిపారు .
ఆలయ పునర్నిర్మాణానికి విరాళాలు
బొల్లాపల్లి : వెల్లటూరులోని సోమేశ్వరస్వామి దేవాలయం పునర్నిర్మాణానికి దాతలు విరాళాలు అందజేసినట్లు దేవదాయ శాఖ అధికారి సీహెచ్ శివనాగిరెడ్డి సోమవారం తెలిపారు. గ్రామానికి చెందిన బేతపూడి వెంకటేశ్వర్లు, అడక లింగరాజులు రూ.2 లక్షల విరాళం అందజేశారు. ఇప్పటికీ వేణుగోపాలస్వామి ఆలయానికి రూ.33.18 లక్షలు, సోమేశ్వరస్వామి ఆలయానికి రూ.78.39 లక్షలు దాతల నుంచి విరాళాలు అందాయన్నారు.
స్వర్ణ కుటీరం నిర్మాణానికి భూమి పూజ
వినుకొండ : స్థానిక కొండమెట్ల వద్ద ఉన్న అతి పురాతన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమం నందు స్వర్ణ కుటీర నిర్మాణానికి సోమవారం భూమి పూజ నిర్వహించారు. మాజీ ఏజీపీ పోట్లూరి సైదారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణ కుటీర కాశీ వజ్ర వారాహి అమ్మవారి మందిర నిర్మాణ కార్యక్రమంలో పాలుపంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఐదుగురు దాతలు ఒక్కొక్కరు రూ.1.08 లక్షల చొప్పున మొత్తం రూ.5.40 లక్షలు మందిరం నిర్మాణానికి విరాళాలు ప్రకటించారు. కార్యక్రమంలో మేలిశెట్టి ఉషారాణి, ఏటుకూరి కృష్ణవేణి, వి.రమ, పత్తి భ్రమరాంబ, బుర్ర సుజాత పాల్గొన్నారు.
పునీత శౌరి మహోత్సవాలకు జెండా ప్రతిష్ట
ప్రత్తిపాడు: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో పునీత శౌరి మహోత్సవాలకు జెండా ప్రతిష్టా కార్యక్రమం సోమవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ నెల 24వ తేదీ నుంచి డిసెంబరు మూడవ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో తొలి రోజు మేత్రాసన ప్రొక్యురేటర్, ఛాన్సలర్ గురుశ్రీ దాసరి కిరణ్, ఫాదర్లు దిలీప్‌కుమార్, బాలశౌరి, కన్నీ థామస్‌లతో కలిసి జెండాను ప్రతిష్టించారు. ఏసును స్తుతిస్తూ ఆరాధించారు. డిసెంబర్ 3న గురువులతో సమిష్టి పండుగ దివ్యబలి జరుగుతుందని ఫాదర్ దిలీప్ కుమార్ చెప్పారు.
రేపు ప్రభుత్వ ఐటీఐలో
జాబ్ మేళా
గుంటూరుఎడ్యుకేషన్: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 26న ఉదయం 10 గంటలకు గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉన్న ప్రభుత్వ ఐటీఐలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ సాయి వరప్రసాద్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు జాబ్‌మేళా సద్వినియోగంచేసుకోవాలన్నారు. 98663 66187, 95817 94605 నంబర్లలో సంప్రదించాలన్నారు.
ఐఎంఏ గుంటూరు శాఖకు అవార్డులు
ఐఎంఏ గుంటూరు శాఖకు అవార్డులు
ఐఎంఏ గుంటూరు శాఖకు అవార్డులు


