అండర్–14 యోగా రాష్ట్రస్థాయి విజేత ప్రకాశం
జె.పంగులూరు: మండల పరిధిలోని చందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు రోజుల నుంచి 69వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అండర్–14, అండర్–17, అండర్–19 విభాగాల్లో యోగా పోటీ లు జరుగుతున్నాయి. రెండో రోజు సోమవారం అండర్ 14,17 విభాగాల్లో బాలబాలికలకు సంబంధించి యోగా పోటీల విజేతలను ప్రకటించారు. మరో రెండు రోజులపాటు అండర్–19 విభాగంలో యోగా పోటీలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పాఠశాల హెచ్‌ఎం గిరిజ ఆధ్వర్యంలో విజేతలు బహుమతులు అందజేశారు.
విజేతల వివరాలు..
● అండర్–14 ట్రెడిషనల్ యోగా బాలికలు విభాగంలో ఎన్.శృతి (ప్రకాశం) మొదటి స్థానం సాధించి జాతీయ స్థాయి యోగా పోటీలకు ఎంపికై ంది. కృష్ణా జిల్లాకు చెందిన జి.శ్రావణి రెండో స్థానం, చిత్తూరు జిల్లాకు చెందిన కె.తేజశ్రీ మూడో స్థానం సాధించారు.
● అండర్–14 ట్రెడిషనల్ యోగా బాలుర విభాగంలో కృష్ణా జిల్లాకు చెందిన సురేంద్ర మొదటి స్థానం సాధించి జాతీయ స్థాయి యోగా పోటీలకు అర్హత సాధించాడు. గుంటూరు జిల్లాకు చెందిన కౌషిక్ రెండో స్థానం, పశ్చిమ గోదావరికి చెందిన ఆర్.విక్రమాధిత్య మూడో స్థానం సాధించాడు.
● అండర్–17 ట్రెడిషనల్ బాలుర విభాగంలో తూర్పు గోదావరికి చెందిన క్రాతిక్ రామ్ మొదటి స్థానం, గుంటూరుకు చెందిన కె.సంపత్ రెండో స్థానం, వైజాగ్‌కు చెందిన పి.దేవాష్ మూడో స్థానం.
● అండర్–14 ఆర్టిస్టిక్ యోగా ఫైర్ బాలికల విభాగంలో ప్రకాశంజిల్లాకు చెందిన కుంచాల హెప్సిబా, నాయపాము శృతి మొదటి స్థానం, తూర్పు గోదావరికి చెందిన పి.హసిని, ఎం.శ్రీవల్లి రెండో స్థానం, అనంతపురానికి చెందిన కె.మోక్షిత, కె.మోహిత మూడో స్థానం సాధించారు.
● అండర్–17 రిథమిక్ యోగా ఫైర్ బాలికల విభాగంలో విశాఖపట్నంకు చెందిన వాసవి, కౌశల్య మొదటి స్థానం, ప్రకాశానికి చెందిన భవ్యశ్రీ, లిఖిత రెండో స్థానం, తూర్పు గోదావరికి చెందిన జంగీలాబీ, పావని మూడో స్థానం
సాధించారు.
● అండర్–17 రిథమిక్ యోగా ఫైర్ బాలుర విభాగంలో కర్నూల్‌కు చెందిన తులసి సాయి, షాహిద్ అప్రిద్ మొదటి స్థానం, కడపకు చెందిన ప్రశాంత్, లక్ష్మణ్ రెండో స్థానం, ప్రకాశానికి చెంది న మహేష్, మిల్టన్ మూడో స్థానం సాధించారు.
● అండర్–17 ట్రేడిషనల్ యోగా బాలికల విభాగంలో పశ్చిమ గోదావరికి చెందిన భవాని చౌదరి, తూర్పు గోదావరికి చెందిన ఛైత్రశివ వాసుకి రెండవ స్థానం, అనంతపురానికి చెందిన భరణి మూడో స్థానం సాధించారు. విజేతలకు అధికారులు, ప్రజాప్రతినిధులు బహుమతులు అందజేశారు.


