హోరాహోరీగా రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలు
సింగరాయకొండ: ఏఆర్‌సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–19 బాలబాలికల హ్యాండ్ బా ల్ పోటీలు సోమవారం హోరాహోరీగా జరిగాయి. ఈ పోటీల్లో 13 జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. లీగ్ దశలో జరిగిన 30 మ్యాచ్‌ల్లో బాలబాలికలు పోటాపోటీగా పాల్గొన్నారు. లీగ్ మ్యాచ్‌లలో బాలు ర విభాగంలో పూల్ ‘సి’లో విన్నర్స్‌గా విశాఖపట్నం, రన్నర్స్‌గా కర్నూలు, పూల్ ‘డి’లో విన్నర్‌గా కడప, రన్నర్‌గా చిత్తూరు, బాలికల విభాగంలో పూల్ ‘బి’లో విన్నర్‌గా కడప, రన్నర్‌గా ప్రకాశం, పూల్ ‘సి’లో విన్నర్‌గా పశ్చిమ గోదావరి, రన్నర్‌గా విజయనగరం, పూల్ ‘డి’లో విన్నర్‌గా కృష్ణా, రన్నర్‌గా గుంటూరు జట్లు నిలిచాయి.
● మిగిలిన పూల్ విభాగాల్లో జరగాల్సిన పోటీలను మంగళవారం ఉదయం నిర్వహించి క్వార్టర్ ఫైన ల్స్, సెమీ ఫైనల్స్‌ను మధ్యాహ్నానికి పూర్తి చేసి సా యంత్రానికి ఫైనల్స్ నిర్వహించనున్నట్లు టోర్న మెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.శంకర్రావు, అండర్–19 కార్యదర్శి చింపారెడ్డి తెలిపారు. ఎస్సై బీ మహేంద్ర, డీఐఈఓ కే ఆంజనేయులు ఉన్నారు.


