ప్రసన్నాంజనేయునికి సర్వాంగం బహూకరణ
అద్దంకి: మండలంలోని శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో ఆకు పూజలో ఉంచే ఉత్సవ మూర్తికి పట్టణానికి చెందిన మోదడుగు రాంబాబు ధర్మపత్ని ఇందిర వారి కుమారులు వెంకట శ్రీనివాసరావు, ఆంజనేయులు, కుమార్తె నాగాంజలి వెండి (తల నుంచి కాళ్ల వరకు ఉండే వెండి తొడుగు) సర్వాంగాన్ని అందజేశారు. గదను పాలక మండలి అధ్యక్షుడు చుండూరి మురళి సుధాకరరావు అందుకున్నారు. 1.70 కిలోల దాని విలువ రూ.3.23 లక్షలు ఉంటుందని దాతలు తెలిపారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
లాంచీ స్టేషన్‌లో
పర్యాటకుల సందడి
విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున కొండకు ఆదివారం పర్యాటకులు తరలివచ్చారు. కొండను సందర్శించిన పర్యాటకులు మహాస్తూపం, అశ్వమేధ యాగశాల, స్నానఘట్టం, మ్యూజియంలోని 9 అడుగుల బుద్ధుని పాలరాతి విగ్రహం, బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించిన శిలాఫలకాలను తిలకించారు. అనంతరం మాచర్ల మండలంలోని అనుపు, ఎత్తిపోతల జలపాతాన్ని వీక్షించారు. లాంచీ స్టేషన్‌కు రూ.50 వేల ఆదాయం సమకూరినట్లు లాంచీ యూనిట్ మేనేజర్ కె. మస్తాన్‌బాబు తెలిపారు. రామలింగేశ్వరస్వామికి
ఏకాదశ రుద్రాభిషేకం
న్యాయవాదుల
వన సమారాధన
శలపాడు(చేబ్రోలు): చేబ్రోలు మండలం శలపాడు గ్రామంలో గంగాపార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం ఏకాదశ రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. గ్రామ సర్వతోముఖాభివృద్ధిని ఆకాంక్షిస్తూ గ్రామస్తులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గుంటూరు లీగల్: జిల్లాలోని న్యాయవాదుల వన సమారాధన ఆదివారం చిన్న పలకలూరులోని పెట్రోల్ బంకు సమీపంలోని మామిడి తోటలో నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి, వివిధ కోర్టుల న్యాయమూర్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. న్యాయవాదులు, కోర్టు స్టాఫ్ ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంగలశెట్టి శివ సూర్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఏర్పాట్లు చేశారు.
1/1
ప్రసన్నాంజనేయునికి సర్వాంగం బహూకరణ