25 నుంచి అంతర్ కళాశాలల పురుషుల వాలీబాల్ పోటీలు
నరసరావుపేట ఈస్ట్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల వాలీబాల్ పోటీలు ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు కృష్ణవేణి డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు, వ్యాయామ అధ్యాపకుడు ఈదర ఆదిబాబు చెప్పారు. పోటీల కరపత్రాలను శనివారం వారు విడుదల చేశారు.
పోటీలలో భాగంగా వర్సిటీ టీమ్‌ను ఎంపిక చేస్తారని వివరించారు. పోటీలు నాకౌట్ కమ్ లీగ్ పద్ధతిలో నిర్వహించనున్నట్టు తెలిపారు. పోటీలను ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు (చిలకలూరిపేట), డాక్టర్ చదలవాడ అరవిందబాబు (నరసరావుపేట), వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ రామినేని శివరామప్రసాద్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. వర్సిటీ పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలల జట్లు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.


