కార్టూనిస్ట్ సుభానీకి అరుదైన గౌరవం
కారంచేడు: పొలిటికల్ కార్టూనిస్టు సుభాని షేక్‌కి అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్‌లోని(ఆత్రేయపురం) బాపు రమణ అకాడమీ వారు సుభానీ ప్రతిభను గుర్తించి బాపు అవార్డును ప్రకటించింది. వివరాలు.. కారంచేడు గ్రామంలో 1961లో జన్మించారు. ప్రాథమిక విద్యను కారంచేడులోను, కాలేజ్ విద్యను సమీపంలోని చీరాలలో పూర్తి చేశారు. మాస్టర్స్ డిగ్రీని గుజరాత్‌లో పూర్తి చేశారు. చిన్నతనం నుంచి కార్టూన్‌లపై ఉన్న మక్కువతో ఆయన హైదరాబాద్‌లోని ఆంధ్ర భూమి వారపత్రికలో 1985లో జాయిన్ అయ్యారు. 1988 వరకు అక్కడే ఉన్న ఆయనను 1991లో వరకు పొలిటికల్ కార్టూనిస్ట్‌గా విధులు నిర్వహించారు. అక్కడ నుంచి సౌత్ ఇండియాలోనే ఎక్కువ సర్క్యులేషన్ కలిగిన దక్కన్ క్రానికల్ దినపత్రికలో కార్టూనిస్ట్‌గాను, తరువాత కార్టూన్ ఎడిటర్‌గాను అంచలంచలుగా ఎదిగారు. 40 సంవత్సరాల తన సర్వీస్‌లో ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. డిసెంబర్ 15వ తేదీన హైదరాబాద్‌లోని నాంపల్లి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఈ అవార్డును ఆయన అందుకోనున్నారు.
కార్టూనిస్ట్ సుభానీకి అరుదైన గౌరవం


