610 గ్రాముల బంగారం స్వాధీనం
చోరీ కేసులో నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను మీడియా సమావేశంలో ప్రదర్శించారు. రూ.80 లక్షల విలువైన 610 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. రెండు ల్యాప్‌టాప్‌లు, ఐదు గడియారాలతోపాటు చోరీ చేసిన సొత్తుతో కొనుగోలు చేసిన ఆటోలు, నేరాలకు ఉపయోగించిన ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజుల్లోనే చోరీ కేసును ఛేదించిన ఇన్‌చార్జి డీఎస్పీ ఎం.హనుమంతరావు, వన్‌టౌన్ సీఐ ఫిరోజ్, ఎస్‌ఐ పి.వంశీకృష్ణ, ఏఎస్‌ఐ ఎం.శ్రీనివాసరావు, ఇతర సిబ్బందిని ఎస్పీ కృష్ణారావు అభినందించారు.


