సత్రశాలలో జిల్లా అదనపు సీనియర్ జడ్జి ప్రియదర్శిని పూజ
సత్రశాల(రెంటచింతల): సత్రశాలలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానంలో 10వ అదనపు జిల్లా సీనియర్ జడ్జి ప్రియదర్శిని శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భ్రమరాంబికాదేవి అమ్మవారికి కుంకుమార్చన చేశారు. ముందుగా దేవస్థానం ప్రధాన అర్చకులు చిట్టేల శివశర్మ నేతృత్వంలో జడ్జి ప్రియదర్శినికి సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. పోలి పాడ్యమిని పురస్కరించుకుని దేవస్థానం సమీపంలో ప్రతిష్టించిన కృష్ణవేణమ్మకు ప్రత్యేక పూజలు చేపట్టి పవిత్ర కృష్ణానదిలో నదీమ తల్లికి హారతులిచ్చారు. ఎండోమెంట్ ఈఓ గాదె రామిరెడ్డి దేవస్థానం చరిత్రను జడ్జికి వివరించారు.


