జూనియర్స్ విజేత హైదరాబాద్ ఎడ్ల జత
కారెంపూడి: పల్నాటి వీరారాధన ఉత్సవాల సందర్భంగా కారెంపూడిలో జరుగుతున్న రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలలో భాగంగా గురువారం జూనియర్స్ విభాగంలో పోటీలు ఆసక్తికరంగా సాగాయి. హైదరాబాదుకు చెందిన మేకా రామకృష్ణ, ప్రతీక్ ఎడ్ల జత 3,195 అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతిని కై వసం చేసుకున్నాయి. ద్వితీయ బహుమతిని ప్రకాశం జిల్లా నాగులుప్పాడు మండలం మద్దిరాల ముప్పాళ్లకు చెందిన పుచ్చకాయల శేషాద్రి చౌదరి ఎడ్ల జత, తృతీయ బహుమతిని బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెంకు చెందిన అత్తోట శిరీషాచౌదరి, శివకృష్ణ చౌదరి ఎడ్ల జత, నాలుగవ బహుమతిని గుంటూరు జిల్లా లింగాయపాలేనికి చెందిన యల్లం సాంబశివరావు ఎడ్ల జత, ఐదో బహుమతిని గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరుకు చెందిన పోతిన లక్షిత్ చౌదరి ఎడ్ల జత, ఆరో బహుమతిని బాపట్ల జిల్లా రేపల్లెకి చెందిన సుఖవాసి సతీష్‌బాబు ఎడ్ల జత కై వసం చేసుకున్నాయి. బహుమతులను దాతలు పంగులూరి అంజయ్య, శిరిగిరి గోపాలరావు, గుండా వెంకట నరసింహారావు, నర్సింగ నాగేశ్వరరావు, చిరుమామిళ్ల రామలక్ష్మయ్య, పిన్నెల్లి అనంత రామయ్య, నాగారపు సుబ్బారావు సన్స్ రామకృష్ణ, పలిశెట్టి కోటేశ్వరరావు (మునసబు), నాగెండ్ల రామారావులు ప్రదానం చేశారు.


