సొంత వ్యాపారానికి రుణం అండ
నరసరావుపేట: అర్హులైన వారికి రుణ సదుపాయం కల్పిస్తే సొంత వ్యాపారాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పేర్కొన్నారు. బుధవారం భువనచంద్ర టౌన్ హాలులో ఎస్‌బీఐ ఆధ్వర్యంలో రుణ వితరణ (క్రెడిట్ అవుట్‌రీచ్ ప్రోగ్రాం) నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్‌బీఐ ద్వారా 5,555 మంది లబ్ధిదారులకు రూ.118 కోట్ల రుణ సహాయం అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీ లావు ఆలోచన మేరకు ప్రతి నియోజకవర్గంలో ఈ తరహా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ రుణాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివిధ రకాల లోన్లపై అవగాహన కోసం ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఎస్‌బీఐ డీజీఎం సురేష్ ప్రభు, రీజనల్ మేనేజర్ పి.రవికుమార్, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి సయ్యద్ జిలాని, టీడీపీ నాయకులు కపిలవాయి విజయ్ కుమార్, డీఆర్‌డీఏ, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
ఎస్‌బీఐ ద్వారా 5,555 మందికి
రూ.118 కోట్లు అందజేత


